తెలంగాణ తల్లి విగ్రహం... వారికి సీఎం రేవంత్ స్ట్రాంగ్ వార్నింగ్!
అవును... హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో భారీ జనసమూహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
డిసెంబర్ 9న హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో భారీ జన సమూహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఎవరైనా మార్చాలని ఆలోచిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అవును... హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో భారీ జనసమూహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 9.. తెలంగాణ ప్రజలకు ఇష్టమైన, పదికాలాలు గుర్తుపెట్టుకుని పండగ చేసుకునే సందర్భమని రేవంత్ తెలిపారు.
కృష్ణా, గోదావరి నదులు హైదరాబద్ లో ప్రవహిస్తే ఎలా ఉంటుందో.. తెలంగాణలోని నలుమూలల నుంచి వచ్చిన ఆడబిడ్డలను చూస్తే అలాగే అనిపిస్తోందని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై జరిగిన దాడులు, అవహేళనలను మనం చూశామని.. సాధించుకున్న రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించుకోవడం గర్వకారణం అని అన్నారు.
2014 తర్వాత నాటి పాలకులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి ప్రతిమ, అవతరణ దినోత్సవాల నిర్వహణపై ఆలోచించలేదని.. తెలంగాణ సమాజం పదేళ్లపాటు వివక్షకు లోనైందని.. అయితే.. తాము మాత్రం తెలంగాణ తల్లికి రూపమిచ్చి, విగ్రహాన్ని ఏర్పాటు చేశామని.. ఈ విగ్రహ నమూనాను ఎవరైనా మార్చాలని చూస్తే చర్యలు తప్పవని అన్నారు.
ఈ విగ్రహం గురించి నేను.. మంత్రులు, ఎమ్మెల్యేలు, కవులు, కళాకారులు మాట్లాడితే వారంతా కూడా మన గుండెల్లోని కన్నతల్లి ప్రతిరూపంలా అద్భుతంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా సెటైర్లూ పేల్చారు. ఇందులో భాగంగా.. ఈ విగ్రహావిష్కరణతో కొందరికి దుఃఖం, బాధ, ఆవేదన ఉంటుందని.. ఒక వ్యక్తి కుటుంబం, పార్టీ కోసం మనం రాష్ట్రాన్ని తెచ్చుకోలేదని రేవంత్ స్పష్టం చేశారు.
ఇక... మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లి అని.. బహుజనులూ పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్షలు మెరకు తండాలు, గూడేలు, మారుమూల పల్లెల్లోని జనబాహుళ్యంలో ఉన్నది తెలంగాణ తల్లి అని రేవంత్ తెలిపారు. ఈ సందర్భంగా ఈ విగ్రహాన్ని చూస్తుంటే చిన్నప్పుడు మా అమ్మ ఏ విధంగా ఉండెనో అలానే కనిపించిందని వెల్లడించారు.