మూడో భాష మీద సీఎం స్టాలిన్ మెలిక సరే.. వాస్తవం ఏంటి?

ఒక ఇష్యూను టేకప్ చేసిన తర్వాత దాన్ని వదిలిపెట్టకుండా కొనసాగించే విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంత పట్టుదలగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;

Update: 2025-03-04 04:34 GMT

ఒక ఇష్యూను టేకప్ చేసిన తర్వాత దాన్ని వదిలిపెట్టకుండా కొనసాగించే విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎంత పట్టుదలగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందునా.. ద్రవిడ సిద్ధాంతాన్ని.. తమిళ భాషకు సంబంధించిన అంశాలపై ఆయన మరింత గట్టిగా వ్యవహరిస్తుంటారు. మోడీ సర్కారు మీదా ఇప్పటికే నిప్పులు చెరుగుతున్న ఆయన.. కేంద్ర విధానాలపై తనకున్న భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేసే విషయంలో అస్సలు తగ్గట్లేదు. ఇప్పటికే లోక్ సభ ఎంపీ నియోజకవర్గాల పునర్విభజనపైనా.. అందులో ఉత్తరాది అధిపత్యం మీదా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్న ఆయన.. మూడో భాష అంశంపైనా తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

దక్షిణాది మీద హిందీని బలవంతంగా రుద్దుతున్నారన్న ఆయన.. ఇప్పుడో ప్రశ్నను లేవనెత్తారు. మూడో భాషగా హిందీని నేర్పాలంటున్నారు సరే.. ఉత్తరాదిన మూడో భాషగా దేన్ని నేర్పుతారు? అంటూ సరికొత్త మెలిక ప్రశ్నను సంధించారు. జాతీయ విద్యా విధానంలో మూడు భాషల్ని నేర్పాలన్న సంగతి తెలిసిందే. ఇందులో ఇంగ్లిషు.. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన భాషతో పాటు.. మూడో భాషగా హిందీని నేర్పాలన్న కేంద్రం తీరును స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

త్రిభాషా సూత్రాన్ని దక్షిణాదిన అమలు అంశాన్ని ప్రస్తావిస్తూ.. మరి ఉత్తరాదిన అమలు చేస్తే ఏ భాష నేర్పిస్తారో చెప్పాలని క్వశ్చన్ చేశారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో సోమవారం ఒక పోస్టు చేశారు. తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ కొందరు మమ్మల్నిఅడుగుతున్నారు. కానీ.. ఉత్తరాదిలో మూడో భాషగా ఏ భాషను నేర్పుతున్నారో చెప్పటం లేదు. అక్కడ రెండు భాషల్ని మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? అన్నది సీఎం స్టాలిన్ ప్రశ్న.

అటు స్టాలిన్ వైపు కాకుండా.. ఇటు మోడీ సర్కారు వైపు కాకుండా.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుకోవాలంటే.. ఉత్తరాదిన చాలా రాష్ట్రాల్లో హిందీతో పాటు వారిదైన సొంత భాష కూడా ఉందన్నది మర్చిపోకూడదు. దక్షిణాది రాష్ట్రాల్ని పక్కన పెడితే.. ఉత్తరాది.. ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే.. మధ్యప్రదేశ్ లో హిందీ మాతృభాష. ఆ రాష్ట్రం నుంచి విడిపోయిన ఛత్తీస్ గఢ్ విషయానికి వస్తే అక్కడి ప్రజలకు చత్తీస్ గఢీ మాతృభాష. మహారాష్ట్రకు మరాఠీ ఉంది. గుజరాత్ కు గుజరాతీ ఉంది. రాజస్థాన్ కు రాజస్థానీ ఉంది. హర్యానా.. పంజాబ్ లలో పంజాబీ, కశ్మీర్ లో కశ్మీరీ.. ఇలా చూస్తే.. దాదాపుగా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక మాతృభాష ఉందన్నది మర్చిపోకూడదు.

ఉత్తరాదిన పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే బెంగాలీ.. ఒడిశాకు ఒరియా.. అసోంలో అస్సామీ.. త్రిపురలో బెంగాలీ.. గోవాలో కొంకణి.. మణిపూర్ మణిపురి.. మేఘాలయలో ఖాసీ.. మిజోరంలో మిజో.. నాగాలాండ్ లో అయో.. సిక్కింలో నేపాలీ భాషలు మాతృభాషగా ఉన్నాయి. ఉత్తరాఖండ్.. ఉత్తరప్రదేశ్.. మధ్యప్రదేశ్.. జార్ఖండ్.. హిమాచల్ ప్రదేశ్.. బిహార్ లలో హిందీ ప్రధాన భాషగా ఉన్నప్పటికి.. వారికంటూ కొన్ని భాషలు స్థానిక ప్రజలకు ఉన్నాయన్నది మర్చిపోకూడదు.

బీహార్ విషయానికి వస్తే అక్కడ ఉర్దూ, హిమాచల్ ప్రదేశ్ లో సంస్క్రతం.. జార్ఖండ్ లో భోజ్ పురి మొదలు బోలెడన్ని భాషలు ఉననాయి. ఉత్తరప్రదేశ్ లో ఉర్దూ, ఉత్తరాఖండ్ లో సంస్క్రతి భాషల్ని నేర్చుకుంటూ ఉంటారు. మొత్తంగా చూస్తే.. స్టాలిన్ లాంటి అధినేతల స్టేట్ మెంట్లు విన్నంతనే మెలికి పెట్టినట్లుగా ఉన్నప్పటికి.. లోతుల్లోకి వెళితే.. ఆయన వాస్తవాలు మరోలా ఉండటం కనిపిస్తుంది. భావోద్వేగాలు మంచివే కానీ.. అవేమీ దేశ సమైక్యతను ప్రశ్నించేలా మాత్రం ఉండకూడదన్నది మర్చిపోకూడదు.

Tags:    

Similar News