సీఓఏఐ టెన్షన్... రేడియేషన్ సెగలో 5జీ ఉక్కిరి బిక్కిరి!

ఈ సమయంలో... రేడియేషన్ నిబంధనల కారణంగా 5జీ సేవలు అనుకున్నంత వేగంగా వ్యాప్తి చెందడం లేదని, ఫలితంగా నష్టాలు చూస్తున్నామని సీవోఏఐ చెబుతున్నాయి.

Update: 2024-03-16 15:30 GMT

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 5జీ సేవలు అందుబాటులోకి వచ్చేస్తున్నా.. ప్రపంచ వ్యాప్తంగా టెల్కోలన్నీ 5జీ కోసం పెట్టిన పెట్టుబడుల్ని తిరిగి రాబట్టుకోగలిగినా.. ఇండియాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొందని.. ఈ సమయంలో 5జీ విషయంలో టెల్కోలు విధానపరమైన, నియంత్రణ సంబంధిత సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అంటున్నారు సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీవోఏఐ)! ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే 5జీ సేవలు వేగవంతమయ్యే పరిస్థితి మందగిస్తుందని అంటున్నాయని తెలుస్తుంది!

అవును... భారత్ లో కూడా 5జీ నెట్ వర్క్ ఆరంభమైనప్పటికీ.. అది ఇంకా సామాన్యుల చెందకు చేరడం లేదు! ఇప్పటికే 5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేసే మొబైల్స్ కొనుకున్న వినియోగదారులు పలు ప్రాంతాల్లో 4జీ సేవలతోనే సరిపెట్టుకుంటున్న పరిస్థితి! ఈ సమయంలో... రేడియేషన్ నిబంధనల కారణంగా 5జీ సేవలు అనుకున్నంత వేగంగా వ్యాప్తి చెందడం లేదని, ఫలితంగా నష్టాలు చూస్తున్నామని సీవోఏఐ చెబుతున్నాయి. మరోపక్క చాలా టెలికాం సంస్థలు 5జీ సేవల కోసం అధిక పౌనఃపున్యం ఉన్న స్పెక్ట్రం ను వినియోగిస్తున్నాయని.. దీనివల్ల రేడియేషన్‌ కూడా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో.. తమ పరిస్థితిని వివరిస్తూ, నిబంధనల్లో సడలింపులు కోరుతూ సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా.. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్‌) కు ఇటీవల లేఖ రాసింది. ఈ నెట్ వర్క్ విస్తరించకపోతే తాము నిబంధనలు, నియంత్రణల చట్రంలో చిక్కి అప్పులపాలవుతామని టెల్కోలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో... విమానాశ్రయాలు, వాటి చుట్టుపక్కల సుమారు రెండు కిలోమీటర్ల మేర 5జీ సేవలు విస్తరించకుండా పౌరవిమానయాన శాఖ నిబంధనలు ఉన్నాయని చెబుతున్నాయి టెలికాం సంస్థలు.

దీంతో... ఎయిర్ పోర్ట్ లు, ఎయిర్ స్ట్రిప్ లు, హెలీప్యాడ్లలో 5జీ సేవలు అందుబాటులోకి రావని టెలికాం కంపెనీలు చెబుతున్నాయ్యి. ఇదే సమయంలో ఎయిర్ పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతల్లోనూ 5జీ సేవల నాణ్యత తగ్గిపోతుందని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో తమ పరిస్థితిని అర్ధం చేసుకుని, నిబంధనలను సడలించి, విమాన ప్రయాణికులకు 5జీ సేవలు చేరవేసేందుకు అవకాశం కల్పించాలని పౌరవిమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ)ను సీవోఏఐ కోరుతుంది.

దాంతో విమానాశ్రయాలు, ఎయిర్‌ స్ట్రిప్‌ లు, హెలిప్యాడ్లలో 5జీ సేవలు అందుబాటులోకి రావని టెలికాం కంపెనీలు చెబుతున్నాయి. విమానాశ్రయ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ 5జీ సేవల నాణ్యత తగ్గిపోతుందంటున్నాయి. డీజీసీఏ నిబంధనలను సడలించి, విమాన ప్రయాణికులకూ 5జీ సేవలను చేరువచేసేందుకు అవకాశం కల్పించాలని సీఓఏఐ కోరుతోంది. దీంతో... రేడియేషన్‌ నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటూనే.. 5జీ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చే మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలని సూచిస్తున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News