కంపెనీలకు కొత్త టెన్షన్... ఏమిటీ కాఫీ బ్యాడ్జింగ్?
కోవిడ్-19 తో ఒక్కసారిగా ప్రపంచంలో చాలా పద్దతులు మారిపోయాయి. చాలా దేశాల ఆర్థిక పరిస్థితులు ఇప్పటికీ చక్కబడలేదు
కోవిడ్-19 తో ఒక్కసారిగా ప్రపంచంలో చాలా పద్దతులు మారిపోయాయి. చాలా దేశాల ఆర్థిక పరిస్థితులు ఇప్పటికీ చక్కబడలేదు. ఇదే సమయంలో మాస్కుల అలవాటు పెరిగింది. అదేవిధంగా ప్రధానంగా వర్క్ ఫ్రం హోం ని ఉద్యోగులు అలవాటు చేసుకున్నారు. ఇంటినుంచి వర్క్ చేయడమే కంఫర్ట్ గా భావించడం మొదలైంది. అయితే ఇప్పుడు చాలా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ని రద్దు చేస్తున్నాయి. దీంతో తెరపైకి “కాఫీ బ్యాడ్జింగ్” వచ్చింది.
అవును... ప్రస్తుతం ప్రపంచ దేశాల్లోని ఎక్కువ శాతం కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పనిచేయాల్సిందా కోరుతున్నాయి. వర్క్ ఫ్రం హోంను రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. అయితే... ఇంతకాలం ఇంటిలో ఉండి పనిచేయడానికి అలవాటు పడి, అదే కంఫర్ట్ అని భావిస్తున్న ఉద్యోగులు మాత్రం అందుకు అంగీకారం తెలపడం లేదు. అయినా తప్పని పరిస్థితుల్లో ఆఫీసుకు వెళ్లాల్సి వస్తే... కాఫీ బ్యాడ్జింగ్ అనే కొత్త ట్రెండ్ ఫాలోఅవుతున్నారు.
కాఫీ బ్యాడ్జింగ్ అంటే... ఎవరైతే ఆఫీస్ లో పనిచేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నారో... ఆ ఉద్యోగులు అంతా ఆఫీస్ లో ఐడీని స్వైప్ చేసిన అనంతరం సహాచరులకు కలిసి కాఫీ తాగే ప్రదేశానికి వెళ్లిపోతారు. అక్కడే హెచ్‌ఆర్, మేనేజర్ల దృష్టిలో పడేలా అటు ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేస్తారు. ఆ తర్వాత డెస్క్ కు వచ్చి కాసేపు టైం పాస్ చేసి ఇంటికి బయలుదేరతారు. దీన్నే కాఫీ బ్యాడ్జింగ్ అంటారు.
అయితే... సంస్థల్లో ప్రతి విభాగంలో ఒకరో, ఇద్దరో ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్ కు పాల్పడితే అది పెద్ద సమస్యగా పరిణమించదు కానీ... ప్రస్తుతం హై స్కిల్ ఉన్న ఉద్యోగులు పెద్ద ఎతూన ఆఫీస్ పనిచేయకుండా కాఫీ కప్పులు చేతపట్టి కబుర్లతో కాలక్షేపం చేస్తుండటంతో యామాన్యాలకు కొత్త టెన్షన్ వచ్చిపడింది.
ఈ సమస్యలపై తాజాగా "ఓల్ ల్యాబ్స్" అనే సంస్థ చేపట్టిన సర్వేలే కీలక విషయాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... హైబ్రిడ్ వర్క్ చేస్తున్న ప్రతి 5 మందిలో ఒకరు మాత్రమే పూర్తిస్థాయిలో ఆఫీస్ లో పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో 37 శాతం మంది హైబ్రిడ్ వర్క్ ను, 41 శాతం మంది ఉద్యోగులు పూర్తిస్థాయిలో రిమోట్ వర్క్ ను కోరుకుంటున్నారని ఆ సర్వేలో వెల్లడైంది.
ఇదే సమయంలో ఓల్ ల్యాబ్స్ చేసిన తాజా అధ్యయనంలో తప్పని సరిగా ఆఫీస్ లో పనిచేయాలన్నా నిబంధనను వ్యతిరేకిస్తున్న ఉద్యోగుల్లో సగానికిపైగా (58శాతం) మంది కాఫీ బ్యాడ్జింగ్ కు పాల్పడుతున్నారని తెలుస్తుంది. ఇదే సమయంలో మరో 8 శాతం మంది రోజులో అత్యధిక సార్లు కాఫీ బ్యాడ్జింగ్ కు పాల్పడడంతో ఆఫీస్ కార్యకలాపాల నిర్వహణ యజమానులకు సవాలుగా మారినట్లు తెలుస్తోంది.
దీంతో... ఈ కాఫీ బ్యాడ్జింగ్ ట్రెండ్ తగ్గాలంటే కంపెనీలు అంతర్గత సమస్యలను పరిష్కరించాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఉద్యోగులతో యాజమాన్యాలు కమ్యూనికేషన్ ను పెంపొందించుకోవాలని, వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని.. దానితోపాటు ఉద్యోగుల్ని ఆకట్టుకునేలా ఆఫీస్ వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.