ఏఏ పార్టీకి ఏఏ సామాజికవర్గం ఓట్లు.. సర్వేలో ఆసక్తికర విషయాలు..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బీఆర్ఎస్, బీజేపీ ఓటమిపై ఏఏ సామాజికవర్గాలు ఏ మేరకు ప్రభావితం చూపాయన్న దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు బీఆర్ఎస్, బీజేపీ ఓటమిపై ఏఏ సామాజికవర్గాలు ఏ మేరకు ప్రభావితం చూపాయన్న దానిపై ప్రస్తుతం చర్చ మొదలైంది. ఎలాగైనా అధికారం దక్కించుకోవాలి అనుకున్న కాంగ్రెస్, రెండు పర్యాయాలు పాలించిన బీఆర్ఎస్, బీసీ సీఎం నినాదంతో ముందుకెళ్లిన బీజేపీ ఆయా కులాల ఓట్లను తమ వైపునకు తిప్పుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని ఫలితాలను చూస్తే తెలుస్తోంది. దీంతో పాటు మొదటి నుంచి కాంగ్రెస్ గెలుస్తుందన్న సర్వేల రిపోర్టులు కూడా కొంత ప్రభావితం చూపాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవన్నీ కలుపుకుంటే అనుకున్న మేర ఆయా సామాజికవర్గాల ఓట్లను రాబట్టుకోవడంలో మూడు పార్టీలు కూడా డక్కా ముక్కీలు తిన్నట్లు తెలుస్తోంది.
రెడ్డి సామాజికవర్గాన్ని ఆకట్టుకోవడంలో కాంగ్రెస్ సఫలీకృతమైంది. దీనితో పాటు ఎస్టీలో సబ్ కాస్ట్ అయిన లంబాడీలను, లంబాడీ తండాలను గంపగుత్తగా తమవైపునకు తింపుకుంది. వీరితో పాటు యాదవ్, గొల్ల, కుర్మలు కూడా కాంగ్రెస్ పార్టీని అక్కున చేర్చుకున్నారు. కాంగ్రెస్ తో పోలిస్తే ముదిరాజులు, తెనిగ కులాలతో పాటు ఎస్టీలు కూడా బీఆర్ఎస్ ను ఆదరించారు. దళిత బంధు ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ 3 శాతం ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ కంటే బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. రెడ్డి సామాజికవర్గాన్ని పక్కన పెడితే ఇతర అప్పర్ క్యాస్ట్ కు చెందిన వారు కూడా కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ ను ఎక్కువగా ఆదరించారు.
ఇక బీజేపీ గతంలో కంటే బాగానే పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పవచ్చు. కానీ ఆ పార్టీకి ‘బీసీ సీఎం’ నినాదం మాత్రం అస్సలు కలిసి రాలేదనే చెప్పవచ్చు. బీసీ ఓట్లను ఎక్కువగా కాంగ్రెస్ ఒడిసి పట్టుకోగా.. అందులో కొన్ని సబ్ క్యాస్ట్ ఓట్లను బీఆర్ఎస్ దక్కించుకుంది. ఇక బీజేపీ మాత్రం మూడో స్థానానికే పరిమితమైంది. ఇందులో కూడా రెడ్డి సామాజికవర్గం కంటే అదర్ అప్పర్ క్యాస్ట్ ఎక్కువగా బీజేపీని ఆదరించారు. ఆ తర్వాతి స్థానంలో కొంత మేరకు బీసీలు కలిసివచ్చాయి. కానీ సామాజికవర్గంగా చూసుకుంటే మాత్రం రెండు ప్రధాన పార్టీల కంటే భారీ వ్యత్యాసంతో బీజేపీ ఉందని చెప్పవచ్చు.
లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వేలో ఏఏ సామాజికవర్గం ఓట్లు ఎటు పోలయ్యాయో వివరాలు ఈ పట్టికలో చూద్దాం.