రాహుల్ రాజ‌కీయం.. ఇక‌, చాప‌చుట్టేయ‌డ‌మే బెట‌రా ..!

కాంగ్రెస్ పార్టీ యువ నాయ‌కుడు, ఎంపీ.. రాహుల్ గాంధీ రాజ‌కీయాలు స‌క్సెస్ కావ‌డం లేదు.

Update: 2024-11-23 15:30 GMT

కాంగ్రెస్ పార్టీ యువ నాయ‌కుడు, ఎంపీ.. రాహుల్ గాంధీ రాజ‌కీయాలు స‌క్సెస్ కావ‌డం లేదు. ఆయ‌న అనేక రూపాల్లో ప్ర‌జ‌ల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా.. అవి ఏమాత్రం కాంగ్రెస్ గ్రాఫ్‌ను పెంచ‌లేక పోతున్నాయి. అతి పెద్ద రాష్ట్రాలుగా ఉన్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర వంటివాటిలో కాంగ్రెస్‌కు చావు దెబ్బ‌లు త‌ప్ప‌డం లేదు. దీనికి కార‌ణం .. రాహుల్ రాజ‌కీయ‌మేన‌న్న‌ది విశ్లేష‌కుల భావ‌న‌. కుల గ‌ణ‌న పేరుతో పెద్ద ఎత్తున రాహుల్ రాజ‌కీయం చేస్తున్నారు.

తాజాగా మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లోనూ కుల గ‌ణ‌న‌ను ఆయ‌న తెర‌మీదికి తెచ్చారు. తాము అధికారంలోకి రాగానే .. కుల‌గ‌ణ‌న చేప‌డ‌తామ‌ని చెప్పారు. అదేస‌మ‌యంలో ఇత‌ర ప‌థ‌కాలు కూడా ప్ర‌క‌టించారు. ఏడు గ్యారెం టీలు ఇచ్చారు. అయితే.. వీటిలో ఏ ఒక్కటీ స‌క్సెస్ కాలేదు. నేల చూపుల దిశ‌గానే కాంగ్రెస్ ప్ర‌యాణం సాగిపోతోంది. మొత్తానికి గ‌తంలో ఉన్న సీట్ల‌ను కూడా ఇప్పుడు తెచ్చుకునే ప‌రిస్థితి లేకుండా పోయింది. దీంతో అన్ని వేళ్లూ ఇప్పుడు రాహుల్ వైపే చూపుతున్నాయి.

మొత్తం 288 స్థానాలుఉన్న మ‌హారాష్ట్ర లో 40-50 మ‌ధ్య స్థానాల‌కే కాంగ్రెస్ కూట‌మి ప‌రిమితం అయ్యే ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. బ‌ల‌మైన వ్యూహం కొర‌వ‌డ‌డంం.. అభివృద్ధిని వ‌దిలి సంక్షేమానికి పెద్ద పీట వేయ‌డం.. అలివికాని హీమీల‌ను ఇవ్వ‌డం వంటివి కాంగ్రెస్ వ్యూహాల‌కు బ్రేకులు వేస్తోంది. నిజానికి మ‌హారాష్ట్ర‌లో అనేక మంది అగ్ర‌నాయ‌కులు ప్ర‌చారం చేశారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి అక్క‌డే తిష్ట వేసి ప్ర‌చారం చేసినా.. ఫ‌లితం మాత్రం రివ‌ర్స్ అయిపోయింది.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. కేంద్రంలో మోడీ ఉన్నంత వ‌ర‌కు రాహుల్ రాజ‌కీయంగా కొన్నాళ్లు చాప‌చుట్టేయ‌డ‌మే బెట‌ర్ అంటున్నారు ప‌రిశీల‌కులు. లేదా.. ఆయ‌న మ‌రింత ప‌రిజ్ఞానం పెంచుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న విష‌యాన్న‌యినా గుర్తించాల‌ని చెబుతున్నారు. సో.. ఇప్పుడు న్న ప‌రిస్థితి ఒక్కొక్క రాష్ట్రం కాంగ్రెస్ చేజారి పోతోంది. ఇటీవ‌ల ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ త‌ర్వాత‌.. ఇప్ప‌డు మహారాష్ట్ర వంటి అతి పెద్ద రాష్ట్రం చేజారిపోవ‌డాన్ని రాహుల్ రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు ఎదుర్కొన‌క త‌ప్ప‌డం లేదు.

Tags:    

Similar News