పాడిందేపాట.. కాంగ్రెస్ 'మహామంత్రం' ఇదేనా?
తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) నాయకులు మూడు రోజుల సమావేశానికి తెరదీశారు.;

పాడిందేపాట.. అన్నట్టుగా ఉంది.. అతి పురాతన కాంగ్రెస్ పార్టీ తీరు. పార్టీని పరుగులు పెట్టిస్తాం.. అంటూ.. ట్రెడ్‌మిల్‌పైనే నాయకులు పరుగులు పెడుతున్న తీరు.. పార్టీ సీనియర్లకు సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోం ది. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) నాయకులు మూడు రోజుల సమావేశానికి తెరదీశారు. కానీ, ఈ సమావేశంలోనూ చెప్పుకొన్న సంకల్పం.. పాతదే. పాచిపట్టిందేన న్న విమర్శలు వస్తున్నాయి.
''ప్రక్షాళన చేస్తాం. సంస్థాగత నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం. పార్టీలో వ్యవస్థలను గాడిలో పెడతాం'' అం టూ.. ఏఐసీసీ అధ్యక్షుడి హోదాలో మల్లికార్జున ఖర్చే చెప్పిన మాట.. ఎక్కడో విన్నట్టుగా ఉందే.. అని చాలా మంది నాయకులు గత ఏడాది నాటి వీడియోలను మననం చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత.. రాజస్థాన్‌లో జరిగిన 'చింతన్ శిబిర్'లోనూ.. అచ్చంగా మల్లికార్జున ఖర్గే ఈ వ్యాఖ్యలే చేశారు. సంస్థాగతంగా పార్టీని గాడిలో పెడతామనే చెప్పారు.
కానీ.. ఏడాది జరిగినా.. ఇప్పటి వరకు.. వచ్చిన మార్పులు, చేసిన మార్పులు ఏంటంటే.. మొహాలు చూసు కునే పరిస్థితి వచ్చింది. నవనవోమ్నేషంగా ముందుకు సాగుతున్న బీజేపీకి అడ్డు కట్ట వేయాలన్నది కాం గ్రెస్ వ్యూహం. అయితే.. ఈ క్రమంలో వేస్తున్న అడుగులు.. తప్పటడుగులు మాదిరిగానే మిగులుతున్నా యన్నది పార్టీ నాయకులే ఆరోపిస్తున్నారు. శశిథరూర్ వంటి అగ్రనాయకులు ఈ సమావేశానికి డుమ్మా కొట్టింది కూడా అందుకేనన్న ఆరోపణలు ఉన్నాయి.
''మాకు కావాల్సింది.. నాయకుల మార్పు కాదు. వ్యవస్థీకృత మార్పు'' అంటూ.. శశిథరూర్ చేసిన వ్యాఖ్య లు.. కాంగ్రెస్ అగ్రనేతలకు రుచించకపోవచ్చు. కానీ.. బీజేపీలో ఇలాంటి మార్పే అధికారాన్ని అందివచ్చే లా చేస్తోంది. మిత్రపక్షాలతో కయ్యానికి దిగకుండా.. బీజేపీ వేస్తున్న అడుగులు చూసిన తర్వాతైనా.. కాంగ్రె స్ నడక మార్చుకుంటుందని అనుకున్నారు. కానీ, ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. మిత్రపక్షాలపై తొడగొట్టి.. అధికారాన్ని పడగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న తీరు.. ఢిల్లీలో కనిపించింది.
ఈ ఏడు.. వచ్చే ఏడు.. మూడు రాష్ట్రాల్లో కీలక ఎన్నికలు ఉన్నాయి. బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు లో జరిగే ఎన్నికల విషయంలో అయినా.. కాంగ్రెస్ తన పంథాను మార్చుకోవాల్సి ఉందన్న సూచనలు వినిపిస్తున్నాయి. కానీ.. ఆ పార్టీ ఆదిశగా వేస్తున్న అడుగులు నామమాత్రంగానే ఉన్నాయి. పైగా.. ప్రక్షాళన పేరుతో కుటుంబాలను ప్రోత్సహించడం.. ద్వారా.. కాంగ్రెస్ ఇంకా మార్పలేదన్న.. మార్పు రాలేదన్న వాదనను సుస్థిరం చేసుకుంటుండడం గమనార్హం.