బాత్ రూమ్ లో సీసీ కెమెరా... దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మహిళ!

అవును... బెంగళూరులో సినిమా షూటింగ్ తరహాలో ఓ సన్నివేశం జరిగింది. ఇందులో భాగంగా.. టూవీలర్ పై వెళ్తున్న ఓ యువకుడిని కొంతమంది వ్యక్తులు వెంటాడుతున్నారు.

Update: 2025-01-26 12:30 GMT

సెక్యూరిటీ విషయంలోనూ, పోలీసులకు నేర దర్యాప్తుల్లోనూ ఎంతో సహకరించే సీసీ కెమెరాలను చాలా మంది తప్పుడు పనులకు ఉపయోగిస్తుంటారనే సంగతి తెలిసిందే. ఈ ప్రపంచంలో ఏ కొత్త ఇన్నోవేషన్ వచ్చినా.. దాన్ని తప్పుడుగా ఎలా వాడొచ్చు అనే ఆలోచనలతో ఓ బ్యాచ్ ఎప్పుడూ బిజీగా ఉంటుందని చెబుతారు. అది సోషల్ మీడియా అయినా.. సెల్ ఫోన్ అయినా!

ఈ క్రమంలో సీసీ కెమెరాలను అలానే వాడుతుంది ఓ బ్యాచ్! ఇళ్లు, ఆఫీసులు, షాపింగ్ మాళ్లు, రోడ్లు, రద్ది ప్రదేశాలలో సీసీకెమెరాలు ప్రజలకు ఎంతో సెక్యూరిటీగా ఉంటాయని చెబుతారు. అయితే.. అలాంటి సీక్రెట్ కెమెరాలను మహిళల బాత్ రూమ్స్ లోనూ, షాపింగ్ మాల్స్ లోని ట్రైల్ రూమ్స్ లోనూ పెట్టి తప్పుడు పనులకు పాల్పడుతున్నారు కొంతమంది.

ఈ నేపథ్యంలో ఓ మహిళ బాత్ రూమ్ లో పెట్టిన సీసీకెమెరా వ్యవహారం తాజాగా తెరపైకి వచ్చింది.. ఈ సమయంలో అనుమానితుడిని వెంటాడి పట్టుకుని, చితక్కొట్టేశారు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు. అయితే.. ఈ ఫైనల్ గా ఈ వ్యవహారంపై ఆమె ఇచ్చిన ట్విస్ట్ కి అంతా ఒక్కసారిగా షాకయ్యారు. ఆ కథేమిటో ఇప్పుడు చూద్దామ్...!

అవును... బెంగళూరులో సినిమా షూటింగ్ తరహాలో ఓ సన్నివేశం జరిగింది. ఇందులో భాగంగా.. టూవీలర్ పై వెళ్తున్న ఓ యువకుడిని కొంతమంది వ్యక్తులు వెంటాడుతున్నారు. కార్లు, బైక్ లతో ఓ భారీ ఛేజింగ్ సీన్ ని తలపించేలా ఆ సన్నివేశం నడుస్తుంది. ఈ సమయంలో తప్పించుకునే క్రమంలో అలసిపోయిన యువకుడు.. బైక్ పై స్లిప్ అయ్యాడు.

అంతే... ఒక్కసారిగా ఆ యువకుడిని తరుముతున్నవారంతా చుట్టుముట్టారు.. బైక్లు, కార్లు దిగి వచ్చి అతడిని చితక్కొట్టేశారు. ఈ సమయంలో బాధిత మహిళగా చెబుతున్న ఆమె కూడా తన జీవితం నాశనం చేశావంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.

ఈ సమయంలో.. తన భార్యను ఇతడు నగ్నంగా చిత్రీకరించాడని ఓ వ్యక్తి పోలీసులకు చెప్పాడు. గ్రీజర్ రిపేర్ నెపంతో తమ ఇంట్లోకి వచ్చిన ఆ వ్యక్తి.. తమ బాత్ రూమ్ లో సీసీ కెమెరా పెట్టాడని పోలీసులకు వెల్లడించాడు. ఈ విషయాన్ని తన భార్యే స్వయంగా తనకు చెప్పినట్లు పోలీసులకు వివరించాడు.

అయితే... గ్రీజర్ లో సీసీ కెమెరాలు పెట్టడం ఎలా వీలవుతుంది.. గ్రీజర్ ను ఒక్కసారి స్విచ్ ఆన్ చేస్తే విపరీతంగా వేడెక్కుతుంది కదా.. అనే సందేహాలు రావడంతో పోలీసులు సదరు మహిళను ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఈ సమయంలో తొలుత కాస్త తటపాయించినా.. కాస్త గట్టిగా అడిగే సరికి అసలు విషయం చెప్పింది.

ఇందులో భాగంగా... నిందితుడికి, త్నకు వివాహేతర సంబంధం ఉందని వెల్లడించింది. ఈ క్రమంలో అతడి కోరిక మేరకే తాను వీడియోను రికార్డ్ చేసి పంపినట్లు ఒప్పుకుందని అంటున్నారు. ఆ వీడియో కంటపడటంతో తన భర్త వద్ద ఇలా ప్లేట్ ఫిరాయించినట్లు ఒప్పుకుందని అంటున్నారు. దీంతో... అక్కడున్నవారందరికీ దిమ్మతిరిగిందని అంటున్నారు.

Tags:    

Similar News