అందుకే ఎక్కువ జీతాన్ని ఇచ్చే జాబ్ ను వదులుకున్నాడట
నా ఫ్రెండ్ కు ఏడాదికి రూ.23 లక్షల ప్యాకేజీతో ఒక జాబ్ ఆఫర్ వచ్చింది.
రోటీన్ కు భిన్నంగా ఉండేది ఏదైనా ఈ రోజున హాట్ టాపిక్ గా మారటమే కాదు.. అందరిని ఆకర్షించేలా చేస్తోంది. ఇప్పుడు అలాంటి ఒక ఉదంతం అందరిని ఆకర్సిస్తోంది. ఇంతకూ విషయం ఏమంటే.. ఎక్కువ జీతం వచ్చే జాబ్ ఆఫర్ ను తన స్నేహితుడు ఎందుకు రిజెక్టు చేశాడన్న విషయాన్ని ఒక వ్యక్తి లింక్డిన్ లో పోస్టు చేశాడు. అతడు పోస్టులో అందరూ కోరుకునే అంశాలు ఉండటమే కాదు.. కోరుకున్నప్పటికీ ఆచరించే విషయంలో ధైర్యం లేని అంశంలో పోస్టు చేసిన వ్యక్తి స్నేహితుడు ఆచరించటం అందరిని ఆకర్షించిందని చెప్పాలి. ఇంతకూ విషయంలోకి వెళితే..
నా ఫ్రెండ్ కు ఏడాదికి రూ.23 లక్షల ప్యాకేజీతో ఒక జాబ్ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు అతని శాలరీ ప్యాకేజీ రూ.18 లక్షలు మాత్రమే. ఏడాదికి రూ.5లక్షలు అదనంగా ప్యాకేజీ పొందే వీలున్నప్పటికీ.. ఆ జాబ్ కు తన స్నేహితుడు రిజెక్టు చేసిన వైనాన్ని మార్కెటింగ్ నిపుణుడు దేవ్ కటారియా తన లింక్డిన్ ఖాతాలో పోస్టు చేశాడు. నా స్నేహితుడు ఎందుకలా చేశాడు? అన్న సందేహం వచ్చింది. అదే విషయాన్ని తన స్నేహితుడ్ని అడిగితే.. చెప్పిన అంశం ఆసక్తికరంగా మారింది.
‘నా స్నేహితుడు ఒక హైబ్రిడ్ వర్కు కల్చర్ కంపెనీలో రూ.18 లక్షల ప్యాకేజీతో జాబ్ చేస్తున్నాడు. అక్కడ వారానికి ఐదు రోజులు మాత్రమే పని. కొత్త జాబ్ లో మాత్రం వారానికి ఆరు రోజుల పని. వ్యక్తిగత సమయాన్ని కూడా పనికే పరిమితం చేసే ఉద్యోగం.. జీతం ఎక్కువ వస్తున్నప్పటికీ వద్దనుకున్నాడు నా స్నేహితుడు. కుటుంబం.. స్నేహితులతో గడిపేందుకు అనువుగా ఉంటుందని పాత ఉద్యోగంలోనే కంటిన్యూ కావాలనుకున్నాడు’ అని పేర్కొన్నారు.
చాలామందికి పని.. వ్యక్తిగత జీవితం.. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేందుకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంటారని.. పోటీ ప్రపంచంలో డెవలప్ అయ్యేందుకు జీతం ఎంత ముఖ్యమో.. ఆరోగ్యం అంతే ముఖ్యమన్న విషయాన్ని తన తాజా పోస్టుతో చెప్పారు. ఈ పోస్టు అందరిని ఆకర్షిస్తోంది.