ఇప్పటికైనా అక్కాచెల్లెళ్లు ఇద్దరూ ఆగుతారా?

అయితే అక్కడితో ఆగకుండా షర్మిళ, సునీత ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఈ విషయాన్ని జిల్లా కోర్టులోనే తేల్చుకోవాలని వారి పిటిషన్ ను తిప్పి పంపింది!

Update: 2024-05-09 12:15 GMT

యావత్ ఏపీ రాజకీయాలందు కడప రాజకీయం వేరయా అన్నట్లుగా గతకొన్ని రోజులుగా పరిస్థితి మారిపోయిన సంగతి తెలిసిందే! కడప లోక్ సభ స్థానంలో వైఎస్ షర్మిళ వర్సెస్ వైఎస్ జగన్ మధ్య నడుస్తున్న మాటల యుద్ధం రోజు రోజుకీ పీక్స్ కి చేరుకుంటుంది. అయితే షర్మిళ మాత్రం ప్రధానంగా వైఎస్ వివేకా హత్య కేసును ప్రధాన ప్రచార అస్త్రంగా చేసుకుని అవినాష్ పై విమర్శలు గుప్పిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

అవును... కడప లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్ షర్మిళ... సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని పదేపదే వివేకా హత్య కేసులో నిందితుడు అని, కొన్ని సందర్భాల్లో హంతకుడు అన్నట్లుగా అభివర్ణిస్తూ.. ఆమె తన ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. అయితే వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని చెబుతున్న వైసీపీ నేతలపైనా ఫైర్ అవుతున్న షర్మిళ... సీబీఐ ఛార్జ్ షీటులో ప్రస్తావించిన అంశాలనే తాను మాట్లాడుతున్నట్లు చెప్పుకొచ్చారు!

దీంతో... వ్యవహరం చినికి చినికి గాలివానగా మారుతుందని గ్రహించారో ఏమో కానీ వైసీపీ నేతలు కడప కోర్టును ఆశ్రయించారు. దీంతో... వైఎస్ షర్మిళతో పాటు సునీత గాని, బీటెక్ రవి గాని, చంద్రబాబు, లోకేష్, పురంధేశ్వరి ఎవరూ కూడా తమ ఎన్నికల ప్రచారంలో వివేకానంద రెడ్డి హత్య విషయాన్నీ ప్రస్తావించడానికి వీలు లేదని న్యాయస్థానం తీర్పు చెప్పింది!

అయితే అక్కడితో ఆగకుండా షర్మిళ, సునీత ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఈ విషయాన్ని జిల్లా కోర్టులోనే తేల్చుకోవాలని వారి పిటిషన్ ను తిప్పి పంపింది! ఈ సమయంలో.. జిల్లా కోర్టు తమ పాత తీర్పునే పునరుద్ఘాటిస్తూ ఇలాంటి పిటిషన్ తో మళ్ళీ వచ్చినందుకు ఈ ముగ్గురికి తలో పదివేల రూపాయలు వంతున జరిమానా కూడా విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌ కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది.

Tags:    

Similar News