'రాఖీ పండగకు మొగల్ చక్రవర్తికీ కనెక్షన్'... సుధామూర్తి వీడియోపై విమర్శలు!

అవును... రాఖీ పండుగ పాశస్త్యాన్ని వివరిస్తూ సుధామూర్తి ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో భాగంగా... 16వ శతాబ్ధంలో రక్షాబంధన్ సాంప్రదాయం ప్రారంభమైందని ఆమె తెలిపారు.

Update: 2024-08-19 17:30 GMT

దేశవ్యాప్తంగా రాఖీ పర్వదినాన్ని సోదరసోదరీమణులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఎంపీ సుధామూర్తి సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా రాఖీ పండుగకు ఘన చరిత్ర ఉందని చెబుతూ పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు. అయితే... ఈ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈనాటిది కాదంటూ గుర్తుచేస్తున్నారు.

అవును... రాఖీ పండుగ పాశస్త్యాన్ని వివరిస్తూ సుధామూర్తి ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో భాగంగా... 16వ శతాబ్ధంలో రక్షాబంధన్ సాంప్రదాయం ప్రారంభమైందని ఆమె తెలిపారు. రాణీ కర్ణావతి చాలా చిన్న సామ్రాజ్యాన్ని కలిగి ఉన్నదని, అయితే ఓ రోజు ఆమె రాజ్యంపై దండయాత్ర జరుగుతుందని.. దీంతో ఆమెకు ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఓ చిన్న దారాన్ని మొగల్ చక్రవర్తి హుమాయున్ కు పంపించిందని పేర్కొన్నారు.

ఈ దారాన్ని పంపడం ద్వారా తాను ప్రమాదంలో ఉన్నానని.. తనను ఓ చెల్లిగా భావించి రక్షించాలని ఆమె కోరింది.. అయితే ఆ ధారం యొక్క సారాంశం హుమాయున్ కు అర్ధం కాలేదు. దీంతో స్థానికులను అడగ్గా... ఇది సాయం కోరుతూ ఓ సోదరి నుంచి సోదరుడికి వచ్చే పిలుపుకు సంకేతం అని చెప్పారని.. దీంతో విషయం గ్రహించిన హుమాయున్ వెంటనే కర్ణావతికి సాయం చేసేందుకు ఆమె సామ్రాజ్యానికి బయల్దేరారని ఆమె వివరించారు.

అయితే.. అప్పట్లో విమానాలు వంటివి లేవు కదా గుర్రంపైనే వెళ్లారు అని చెప్పుకొచ్చిన సుధామూర్తి... అప్పటికే చాలా ఆలస్యం అజ్రిగిపోయిందని.. అప్పటికి ఆమె ప్రాణాలతోనే లేరని.. కానీ నాటి నుంచీ రాఖీ సాంప్రదాయం మాత్రం కొనసాగుతూ వస్తోందని.. అందుకే ఈ పండుగ నాడు మహిళలు ఎంతదూరంలో ఉన్నా సరే వారి సోదరుల వద్దకు వెళ్లి రాఖీ కడుతున్నారని ఆమె ఈ వీడియోలో వివరించారు. .

అప్పట్లో విమానాల వంటివి లేవు కదా.. గుర్రంపైనే వెళ్లారు. కానీ అప్పటికే చాలా ఆలస్యం జరిగింది. ఆమె ప్రాణాలతో లేరు. కానీ, అప్పటి నుంచి రాఖీ సంప్రదాయం మాత్రం కొనసాగుతూ వస్తోంది. అందుకే ఈ పర్వదినం నాడు మహిళలు ఎంతదూరంలో ఉన్నాసరే వారి వారి సోదరుల వద్దకు వెళ్లి రాఖీ కడుతున్నారు అని సుధామూర్తి ఆ వీడియోలో వివరించారు.

ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. అయితే చాలా మంది మాత్రం... "16వ శతాబ్ధంలో చితోడ్ గఢ్ రాణి కర్ణావతి ప్రమాదంలో ఉన్నప్పుడు.. ఆమె, మొగల్ చక్రవర్తి హుమాయున్ ను సాయం అడిగరని.. అప్పటి నుంచి రాక్షాబంధన్ సాంప్రదాయం మొదలైందని" సుధామూర్తి చెప్పడంపై విమర్శలు గుప్పిస్తున్నారు.

ఇందులో భాగంగా... రాఖీ పండుగ అనేది పురాణాల కాలం నుంచి ఉందని.. ఈమె చెప్పింది కల్పితం అని.. ఆమెకు చరిత్ర గురించి ఏమీ తెలియదేమో అంటూ కామెంట్లు పెడుతున్నరు. ఈ సందర్భంగా పురాణాల్లో జరిగినట్లు చెప్పే విషయాలను వెల్లడిస్తున్నారు.

మహాభారతంలో కృష్ణుడి మణికట్టుకు గాయమై రక్తం ధారగా వచ్చిందని.. అది చూసిన ద్రౌపది తన చీర కొంగును చించి ఆయన చేతికి కట్టిందని.. అప్పుడు కృష్ణుడు నీకు ఏ కష్టం వచ్చినా నేను రక్షగా ఉంటానని ద్రౌపదికి అభ్యమిచ్చాడని.. కౌరవసభలో దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేయగా ఆమెను శ్రీకృష్ణుడు రక్షిస్తాడని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మన పురణాలా గురించి తెలుసుకోండని సుధామూర్తికి సూచిస్తున్నారు.

Tags:    

Similar News