రూమర్లే నిజమవుతోన్న వేళ...త్వరలో వెయ్యినోటు?

తాజాగా మరోమారు ఉన్న నోట్ల రద్దు

Update: 2023-07-26 04:18 GMT

నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీయే ప్రభుత్వం 2016లో పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉన్నఫలంగా మోడీ ఈ నిర్ణయం ప్రకటించడంతో... నాటి నుంచీ ఈ నోట్ల రద్దు, కొత్త నోట్ల రాక వంటి విషయలకు సంబంధించి ఊహాగాణాలు వెలువడుతూనే ఉన్నాయి.

ఇందులో భాగంగా తాజాగా మరోమారు ఉన్న నోట్ల రద్దు.. కొత్త నోట్ల రాక వంటి రూమర్లు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ విషయాలపై పార్లమెంటులో ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినా నమ్మే పరిస్థితి లేదని అంటున్నారు. కారణం... గతంలో ప్రభుత్వం చేసిన ప్రకటనలకు, తాజాగా తీసుకున్న నిర్ణయాలకూ పొంతనపేకపోవడమే.

ఉదాహరణకు రెండు వేల రూపాయ‌ల నోటు గురించి అది ర‌ద్దు కాబోతోంద‌నే ప్రచారం ఓ టైం లో గ‌ట్టిగా జ‌రిగింది. దీనిపై ప‌లువురు పార్లమెంటేరియ‌న్లు కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లోనే అడిగారు. రెండు వేల రూపాయ‌ల నోటును ర‌ద్దు చేసే ఉద్దేశం ఉందా.. అంటూ ప్రశ్నించారు. అయితే అలాంటి ఉద్దేశ్యం తమకు లేద‌ని కేంద్రం స్పష్టం చేసింది.

అయితే అందుకు పూర్తి వ్యతిరేకంతా కొన్ని రొజుల క్రితం కేంద్రం రెండు వేల రూపాయ‌ల నోట్లను వెన‌క్కు తీసుకుంటున్నట్టుగా ప్రక‌టించింది. ప్రస్తుతం ఆ నోట్లను వెన‌క్కు తీసుకోవ‌డానికి గ‌డువు స‌మ‌యం కొన‌సాగుతూ ఉంది. పార్లమెంట్ లోనేమో రెండు వేల నోటును ర‌ద్దు చేసే ఉద్దేశం లేదని చెప్పింది.. ఆ త‌ర్వాత కొన్నాళ్లకు ర‌ద్దు ప్రక‌ట‌న చేసింది.

దీంతో నోట్ల రద్దు విషయంలో పుకార్లకు విలువ పెరిగింది. పార్లమెంటులో కేంద్రం ఇచ్చే సమాధానాల్లో నిజం లేదని... కొన్నిసార్లు ఈ రూమర్లే నిజం అవుతున్నాయని పలువురు ఈ విషయంతో క్లారిటీకి వచ్చేశారు. సరిగ్గా ఈ సమయంలో వెయ్యి నోట్లు రాబోతున్నాయి.. ఐదొందల నోట్లు రద్దవబోతున్నాయనే రూమర్లు రావడం మొదలయ్యింది.

అవును... డీమానిటైజేష‌న్ ముందు మారకంలో ఉన్న వెయ్యి రూపాయల నోటు మరలా రాబోతుందని.. ఐదువందల నోట్ల రద్దు గురించిన ఆలోచన కేంద్రం వద్ద ఉందని అంటున్నారు. అయితే ఐదువందల నోటు రద్దు విషయంలో కాస్త అటు ఇటుగా ఉన్నప్పటికీ... వెయ్యి నోట్లు మారకంలోకి తెచ్చే విషయంలో మత్రం కన్ ఫాం గా నిర్ణయం తీసుకోబోతోందని రూమర్లు వస్తున్నాయి.

ఇదే సమయంలో అలాంటిదేమీ లేదని అంటోంది కేంద్రం. గతంలో రెండువేళ నోట్ల మాదిరిగానే అలాంటి ఉద్దేశ్యం తమకు లేదని చెబుతోంది. దీంతో... వెయ్యి రూపాయ‌ల నోటును తిరిగి తీసుకు వ‌చ్చే ఉద్దేశం ప్రస్తుతానికి లేద‌ని.. ఐదు వంద‌ల రూపాయ‌ల నోటును ర‌ద్దు చేసే ఉద్దేశం లేద‌ని చెప్పింది.

దీంతో... కేంద్రం పార్లమెంటులో చెప్పిందంటే అందుకు వ్యతిరేకంగా జరిగే ఛాన్స్ ఉందని... రెండు వేల నోట్ల రద్దు విషయంలో జరిగింది ఇదే అని... వెయ్యి నోట్లు వచ్చే ఛాన్స్ అయితే కచ్చితంగా ఉందని అంటున్నారు. మరి నిజంగానే ఐదొందల నోటు రద్దు చేస్తుందా.. వెయ్యి నోటు తెరపైకి తెస్తోందా.. ఎన్నికలు సమీపిస్తోన్న వేళ కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది ఆసక్తిగా మారింది.

కాగా... ఎన్డీఏ ప్రభుత్వం 2016లో పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే రూ.5,000 కోట్ల విలువైన 15 టన్నుల బంగారం విక్రయాలు జరిగాయని అప్పట్లో కథనాలొచ్చాయి. బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బు తీసుకోవడానికి జనం ఎగబడ్డారు. ఈ రద్దీలో 150 మంది మరణించారు.

అయితే కేంద్రంమాత్రం... తన నిర్ణయం నగదు రహిత, అవినీతి రహిత సమాజాన్ని సృష్టిస్తుందని.. స్వల్పకాల కష్టాలు దీర్ఘకాల ప్రయోజనాలను కలిగిస్తాయని చెప్పుకొచ్చింది. చివరకు జరిగిందేమిటీ అంటే.. పాత నోట్లను కొత్త నోట్లలోకి మార్చుకోవడమే అనే విమర్శలు అప్పట్లో బలంగా వినిపించాయి.. ఇప్పటికి కూడా వినిపిస్తున్నాయి!!

Tags:    

Similar News