హైదరాబాద్ లోని ఏక్కడెక్కడ రిటెయిల్ స్పేస్ కు గిరాకీనో చెప్పిన రిపోర్టు

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అద్దె లావాదేవీల వివరాల్ని వెల్లడించింది.;

Update: 2025-04-09 06:30 GMT
హైదరాబాద్ లోని ఏక్కడెక్కడ రిటెయిల్ స్పేస్ కు గిరాకీనో చెప్పిన రిపోర్టు

ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగర మార్కెట్ అస్సలు బాగోలేదని.. రియల్ ఎస్టేట్ పడిపోయిందని.. దీంతో మిగిలిన వ్యాపారాలు సైతం డల్ గా ఉన్నట్లుగా అదే పనిగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాంటి వాటికి చెక్ చెప్పేలా తాజాగా ఒక రిపోర్టు వెల్లడైంది. స్థిరాస్తి సేవల సంస్థ కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ వెల్లడించిన రిపోర్టు ప్రకారం దేశ వ్యాప్తంగా రిటెయిల్ లీజింగ్ లావాదేవీల్లో వృద్ధి కనిపిస్తోందని పేర్కొంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో అద్దె లావాదేవీల వివరాల్ని వెల్లడించింది.

అందులో హైదరాబాద్ కు సంబంధించి పేర్కొన్న వివరాలు ఆసక్తికరంగా మారాయి. దేశంలోని మొత్తం లీజింగ్ లావాదేవీల్లో హైదరాబాద్ వాటా 34 శాతంగా పేర్కొంది. చదరపు అడుగుల్లో చెప్పాల్సి వస్తే 8 లక్షల చదరపు అడుగులుగా పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా 8 ప్రధాన నగరాల్లో అద్దె లావాదేవీలు 55 శాతం పెరిగి 24.08 లక్షల చదరపు అడుగులకు చేరినట్లుగా రిపోర్టు వెల్లడించింది. మిగిలిన నగరాల్ని పక్కన పెట్టి హైదరాబాద్ విషయానికి వస్తే అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 106 శాతం వృద్ధిని నమోదు చేసినట్లుగా పేర్కొనటం గమనార్హం.

ఈ వృద్ధిలో ప్రధాన మార్గాల్లో 90 శాతం స్థలాలు అద్దెకు వెళ్లగా.. కొత్తపేట, నల్లగండ్ల, కొంపల్లి ప్రాంతాలు ఉన్నట్లుగా పేర్కొంది. మొత్తం లావాదేవీల్లో 24 శాతం వాటాతో జూబ్లీహిల్స్ అగ్రస్థానంలో ఉన్నట్లుగా తెలిపింది. ఫ్యాషన్.. ఆరోగ్య సంరక్షణ..ఆహారం పానీయాల విభాగాల్లో అత్యధిక డిమాండ్ ఉన్నట్లుగా పేర్కొంది.

లీజింగ్ లావాదేవీల్లో 98 శాతం దేశీయ బ్రాండ్ లకు సంబంధించే ఉన్నాయని.. గిరాకీ పెరిగినప్పటికి షాపింగ్ మాల్స్ లో ఖాళీల రేటు మాత్రం 1.8 శాతంతో స్థిరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గ్రేడ్ ఏ మాల్ సరఫరా పెద్దగా లేదని.. సాధారణ మాల్స్ లో ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. గచ్చిబౌలి.. నానక్ రామ్ గూడ.. టౌలిచౌకిలలో ఫ్లైఓవర్లు.. రోడ్ల విస్తరణ లాంటి ఇతర మౌలిక సదుపాయాల కారణంగా రిటెయిల్ ఎక్కువ అవుతోందని పేర్కొంది. మొత్తంగా చూస్తే.. పాజిటివ్ వైబ్ ఉండేలా రిపోర్టు ఉండటం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News