ఏపీలో రూ. 374, తెలంగాణలో రూ.759 కోట్లు కాజేశారు!
ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 01-01-2023 నుంచి 31-12-2023 వరకూ నమోదైన సైబర్ నేరాల వివరాలను ప్రకటించింది
దేశంలో సైబర్ నేరాల నమోదు ఏటా పెరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా 2023 సంవత్సరంలో నమోదైన సైబర్ నేరాలు, ఆ నేరగాళ్లు కాజేసిన సొమ్ము వివరాలను జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్.సీ.ఆర్.బీ) నివేదిక వెల్లడించింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా 01-01-2023 నుంచి 31-12-2023 వరకూ నమోదైన సైబర్ నేరాల వివరాలను ప్రకటించింది.
అవును... దేశంలో రోజు రోజుకీ పెరుగుతున్న సైబర్ నేరాలు, అందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పరిష్కరించిన కేసులు మొదలైన వివరాలను ఎన్.సీ.ఆర్.బీ. వెల్లడించింది. ఇందులో భాగంగా... ఇప్పటి వరకు 3.2 లక్షల కంటే ఎక్కువ సిం కార్డ్ లు.. 49,000 ఐ.ఎం.ఈ.ఐ. లను భారత ప్రభుత్వం బ్లాక్ చేసిందని తెలిపింది.
ఈ సందర్భంగా... 01-01-2023 నుండి 31-12-2023 మధ్య కాలంలో సిటిజన్ ఫైనాన్షియల్ సైబర్ ఫ్రాడ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ సిస్టం వివరాలను రాష్ట్ర వ్యాప్తంగా వెల్లడించింది. ఇందులో భాగంగా నివేదించబడిన ఫిర్యాదుల సంఖ్యతో పాటు.. నివేదించబడిన మొత్తం సొమ్ము (లక్షల్లో) వెల్లడించింది. లోక్ సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో భాగంగా హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా ఈ విషయాన్ని తెలిపారు.
ఈ సమయంలో దేశంలో అత్యధికంగా సైబర్ నేరాలు నమోదైన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉండగా.. అత్యల్పంగా లక్ష్య ద్వీప్ (29) నేరాలు నమోదయ్యాయి.
అండమాన్ & నికోబార్ - 526 నేరాలు - రూ. 311.97 లక్షలు
ఆంధ్రప్రదేశ్ - 33507 - రూ. 37419.77 లక్షలు
అరుణాచల్ ప్రదేశ్ - 470 - రూ. 765.79 లక్షలు
అస్సాం - 7621 - రూ. 3441.8 లక్షలు
బీహార్ - 42029 - రూ. 24327.79 లక్షలు
చండీగఢ్ - 3601 - రూ. 2258.61 లక్షలు
ఛత్తీస్ గఢ్ - 18147 - రూ. 8777.15 లక్షలు
ఢిల్లీ - 58748 - రూ. 39157.86 లక్షలు
గుజరాత్ - 121701 - రూ. 65053.35 లక్షలు
హిమాచల్ ప్రదేశ్ - 5268 - రూ. 4115.25 లక్షలు
జమ్మూ & కాశ్మీర్ - 1046 - రూ. 786.56 లక్షలు
జార్ఖండ్ - 10040 - రూ. 6788.98 లక్షలు
కర్ణాటక - 64301 - రూ. 66210.02 లక్షలు
కేరళ - 23757 - రూ. 20179.86 లక్షలు
మధ్యప్రదేశ్ - 37435 - రూ. 19625.03 లక్షలు
మహారాష్ట్ర - 125153 - రూ. 99069.22 లక్షలు
పంజాబ్ - 19252 - రూ. 12178.42 లక్షలు
రాజస్థాన్ - 77769 - రూ. 35392.09 లక్షలు
తమిళనాడు - 59549 - రూ. 66123.21 లక్షలు
తెలంగాణ - 71426 - రూ. 75905.62 లక్షలు
ఉత్తర ప్రదేశ్ - 197547 - రూ. 72107.46 లక్షలు
పశ్చిమ బెంగాల్ - 29804 - రూ. 24733.33 లక్షలు