రోజుకు కేవలం 30 నిమషాలు చాలు..జపాన్ పౌరుడి వింత సందేశం..
ప్రతిరోజు ఎనిమిది గంటల చొప్పున నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పెద్దలు చెబుతూ ఉంటారు.
ప్రతిరోజు ఎనిమిది గంటల చొప్పున నిద్రపోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఒకవేళ రోజుకు ఎనిమిది గంటలు నిద్రించకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అని కూడా వైద్యులు చెబుతారు. అయితే ఒక వ్యక్తి వీటన్నిటిని తలకిందులు చేస్తూ గత 12 సంవత్సరాలుగా రోజుకు కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు.
మన శరీరానికి అవసరమైన విశ్రాంతి అందకపోతే మెదడు, శరీరం మనం చేసుకునే పనులకు సహకరించదు. సరే అయినా నిద్ర లేకపోతే తలనొప్పి ,చికాకు ,ఆందోళన లాంటి సమస్యలు తలెత్తుతాయి.కానీ ఆ వ్యక్తికి ఇటువంటి సమస్యలు రాలేదు సరికదా 12 ఏళ్లుగా మంచి ఆరోగ్యంగా ఉన్నాడు అది ఎలాగో తెలుసుకుందాం పదండి..
రోజుకు కేవలం 30 నిమషాలు నిద్రపోతుండడం వల్ల తన పనులు మరింత సమర్థంగా, సులభంగా చేసుకోగలుగుతున్నానని అతను అంటున్నాడు.
పశ్చిమ జపాన్‌లోని హ్యోగో ప్రిఫెక్చర్‌కు చెందిన ఓ సంస్థ వ్యవస్థాపకుడు డైసుకే హోరీ రోజుకు కేవలం 30 నిమషాలు నిద్రిస్తున్నాడు. 40 సంవత్సరాల వయసు ఉన్న డైసుకే సాధారణంగా ఒక మనిషి బ్రతికే సమయాన్ని రెండు రెట్ల పెంచడం కోసం తన శరీరం, మెదడుకి సంబందించి శిక్షణ తీసుకున్నాడు.
ఇలా సాధన చేస్తూ అతను తన నిద్రను రోజుకు 30-45 నిమిషాలకు తగ్గించుకోగలిగాడట. నిద్ర పోయే సమయంలో ఎంతో పని చేసుకోవచ్చు..ఇలా ఎంత అధిక సమయం నిద్రపోయామన్నది ముఖ్యంకాదని అతని భావన. డైసుకే మనం నిద్రించే సమయం కంటే కూడా ఎంత అధిక నాణ్యతతో కూడిన నిద్ర పోతున్నాము అనేది ముఖ్యమని పేర్కొన్నాడు.
తన ఆలోచన అందరికీ అర్థమయ్యేలా 2016లో హోరీ జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్‌ను స్థాపించాడు. అతని దగ్గర శిక్షణ పొందిన వాళ్లు కూడా తమ నిద్రా సమయాన్ని ఏటువంటి ఇబ్బంది లేకుండా తగ్గిస్తున్నారు.అతని దగ్గర శిక్షణ పొందిన ఒక యువతి గత 4 సంవత్సరాలుగా రోజుకు 90 నిమషాలు మాత్రమే నిద్రుస్తున్నట్లు పేర్కొంది. అయితే దీని వల్ల తనకు ఏటువంటి ఇబ్బంది లేదని చెప్పింది. అంతా బాగానే ఉంది కానీ ఇలాంటివి అందరికీ సెట్ కావు..ఒకవేళ ఆయినా..క్రమంగా డిప్రెషన్,నిద్రలేమి లాంటి సమస్యలకు దారి తీస్తాయి అంటున్నారు నిపుణులు.