జగన్‌కు డేంజర్ బెల్స్.. నిజమెంత ..!
వైసీపీ అధినేత జగన్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని.. ఆయన సభ్యత్వం రద్దయిపోతుందని.. అందుకు భయపడుతూ.. ఆయన సభకు వచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
వైసీపీ అధినేత జగన్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని.. ఆయన సభ్యత్వం రద్దయిపోతుందని.. అందుకు భయపడుతూ.. ఆయన సభకు వచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ఒక్క రోజు వచ్చి వెళ్లిపోతే.. సరికాదని.. ఆయన మరుసటి రోజుల్లో కూడా రావాలని.. అప్పుడే.. ఆయన సభ్యత్వా నికి భద్రత ఉంటుందని కూడా పలు మీడియా సంస్థలు.. నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఇది నిజమేనా? జగన్ భయపడుతున్నారా? చూద్దాం!
వాస్తవానికి జగన్ రాజకీయాలను పరిశీలిస్తే.. భయానికి ఎదురొడ్డి తెరమీదికి తెచ్చిన పాలిటిక్సే కనిపిస్తాయి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను ఆయన ఎలా వ్యతిరేకించారు. తన ఎంపీ సభ్యత్వానికిఎలా రాజీనామా చేశారు? పార్టీ ఎలా పెట్టుకున్నారు? అనే చరిత్ర నిన్న మొన్నటిదే. కాబట్టి.. ఎవరో బెదిరిస్తే.. భయపడి పోతారని అనుకుంటే.. పెద్ద పొరపాటే. ఆనాడు కేంద్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రబుత్వాన్ని ఎదిరించిన జగన్‌కు.. ఇప్పుడు రాష్ట్రంలో సభ్యత్వం పోతుందన్న బెంగ ఉంటుందా?!!
పైగా.. ఇప్పుడు జగన్ కు సభ్యత్వంతో పనిలేదు. అధికారమే పోయిన నేపథ్యంలో ఆయన ఏమైనా చేసు కోండి! అని తేల్చి చెప్పారు. సో.. జగన్‌కు డేంజర్ బెల్స్ మోగుతున్నాయని అంటే.. అంతకన్నా తెలివి తక్కువ తనం లేదు. ఇక, తాజాగా సభకు ఎందుకు వెళ్లారన్న ప్రశ్న ఉదయిస్తుంది.. జగన్ చెప్పిన మాటను గుర్తు చేసుకుంటే.. తాను పూర్తిగా సభకు రానని ఎక్కడా చెప్పలేదు. పైగా.. సభ ప్రారంభంలో వచ్చి వెళ్లిపోయినా.. అది సభకు వచ్చినట్టేనని లెక్కలు చెబుతున్నాయి.
పైగా గవర్నర్ ప్రసంగం రోజు ప్రజల ఫోకస్ సభపై ఉంటుంది కాబట్టి.. ఆ రోజు వచ్చి.. తన వాదనను బలంగా వినిపిస్తే..అది నిరసన రూపమే కావొచ్చు.. ప్రజలకు చేరుతుందన్న ఉద్దేశంతో జగన్.. ఫస్ట్ డే వచ్చి ఉంటారు. అంతేకానీ.. ఎవరికో భయపడే నాయకుడు అయితే.. చెల్లి షర్మిల నిప్పులు కురిపించినప్పుడే.. ఆమెను బ్రతిమాలలేదు. ఎన్నికల వేళ ఎంతో మంది వెళ్లిపోయినా.. జంక లేదు. ఇప్పుడు కూడా అంతే. అయితే.. రాజకీయంగా ఏదో అనాలి కాబట్టి అంటున్నారంతే!!