థాయిలాండ్ నుంచి విశాఖకు బల్లులు... అధికారుల ఆసక్తికర నిర్ణయం!
ఇందులో భాగంగా... ఆ మూడు నీలిరంగు నాలుక కలిగిన బల్లులతో పాటు మూడు వెస్ట్రన్ బల్లులను తిరిగి థాయిలాండ్ కు పంపించారు.
కాదేదీ స్మగ్లింగ్ కు అనర్హం అన్నట్లుగా సాగుతుంటాయి కొన్ని వ్యవహారాలు. ఇందులో భాగంగా.. విదేశాల నుంచి అక్రమంగా బంగారం, వజ్రాలు, రకరకాల పాములు తరలిస్తూ.. ఎయిర్ పోర్ట్ లో పట్టుబడిన వారికి సంబంధించిన అనేక కేసుల సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా థాయిలాండ్ నుంచి విశాఖకు బల్లులు తెచ్చిన ఘటన తెరపైకి వచ్చింది.
అవును... థాయిలాండ్ నుంచి విశాఖకు అత్యంత ప్రమాదకరమైన బల్లులను తరలిస్తుండగా విమానాశ్రయంలో కస్టమ్స్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీ.ఆర్.ఐ) అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా... నీలిరంగు నాలుక కలిగిన మూడు బల్లులతో పాటు, మరో మూడు వెస్ట్రన్ బల్లులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా థాయిలాండ్ నుంచి వీటిని అక్రమంగా తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. డీ.ఆర్.ఐ. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో వీటిని గుర్తించారు. ఈ క్రమంలో స్వాధీనం చేసుకున్న బల్లులను ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా అధికారులు ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా... ఆ మూడు నీలిరంగు నాలుక కలిగిన బల్లులతో పాటు మూడు వెస్ట్రన్ బల్లులను తిరిగి థాయిలాండ్ కు పంపించారు. ఈ మేరకు అధికారులు ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. మరోపక్క కేక్ ప్యాకెట్స్ లో భద్రపరిచి ఈ బల్లులను తీసుకొచ్చిన ఇద్దరిని ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.