తెలుసుకోవాల్సిన విషయం... జంక్ ఫుడ్ తో ఊహించని కొత్త సమస్య..!
ఈ అలవాటును ఎంత తగ్గిస్తే అంత మంచిదని.. వీలైనంతవరకూ మానేస్తే మరీ మంచిదని చెబుతుంటారు.
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జంక్ ఫుడ్ కు అలవాటుపదుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జంక్ ఫుడ్ వల్ల వచ్చే సమస్యలపై వైద్యులు నిత్యం అప్ డేట్స్ ఇస్తూనే ఉంటారు. ఇందులో భాగంగా ఈ ఫుడ్ వల్ల ప్రజల జీవితకాలం తగ్గిపోతుందని చెబుతుంటారు.
ఈ అలవాటును ఎంత తగ్గిస్తే అంత మంచిదని.. వీలైనంతవరకూ మానేస్తే మరీ మంచిదని చెబుతుంటారు. ఈ సమయంలో జంక్ ఫుడ్ మానేయమని చెబుతున్నారు ఓ మానసిక వైద్యుడు. ఈ జంక్ ఫుడ్ తో ఊబకాయం, ఇతర అనారోగ్య సమస్యలతో పాటు డిప్రెషన్ కూడా పెరుగుతుందని.. వీలైంతే జంక్ ఫుడ్ ని ట్రాష్ చేయమని సూచిస్తున్నారు.
అవును... మీ గట్ ఆరోగ్యం మెదడు ఆరోగ్యానికి అత్యంత కీలకమని.. ఏమాత్రం అవకాశం ఉన్న ఆరోగ్యాన్ని పాడుచేసే జంక్ ఫుడ్ ని కష్టమైనప్పటికీ ట్రాష్ చేయమని కాలిఫోర్నియాలోని బ్రెయిన్ ఇమేజింగ్ పరిశోధకుడు డాక్టర్ డేనియల్ అమెన్ తెలిపారు. ఉదాహరణకు... మీరు ఆల్ట్రా ప్రాసెస్ట్ ఫుడ్ డైట్ కలిగి ఉంటే.. డిప్రెషన్ తో పోరాడే సమస్య పెరుగుతుందని అన్నారు.
100 ట్రిలియన్లకు పైగా సూక్ష్మజీవులు.. ప్రాథమికంగా బాక్టీరియా, మైక్రోబయో ను తయారు చేస్తాయని చెప్పిన అమెన్.. వాటిని బగ్స్ అని సూచించారు. ఈ నేపథ్యంలో... మెదడుకు మద్దతు ఇవ్వడానికి.. మీ గట్ బగ్ లకు ఆరోగ్యకరమైన ఆహారాలు, ఫైబర్, పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన ప్రోటీన్ లను అందించాలని వివరించారు.
ఇదే క్రమంలో.. ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు, క్యాన్సర్ ప్రమాదాన్ని ఈ జంక్ ఫుడ్ పెంచుతుందని తెలిపారు. ఇదే సమయంలో... ఓ అధ్యయనం ప్రకారం జంక్ ఫుడ్ తినని వ్యక్తుల కంటే.. అల్ట్రా ఫాసెస్డ్ ఫుడ్ తినే వ్యక్తులు డిప్రెషన్ కు గురయ్యే ప్రమాదం 50% ఎక్కువగా ఉందని తెలిపారు.