ఐదేళ్లు జరిగిందిదే... జగన్, భారతిపై దస్తగిరి సంచలన వ్యాఖ్యలు!

అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కాస్త తీవ్రత తగ్గినట్లు అనిపిస్తున్న నేపథ్యంలో... ఇటీవల వివేకా కుమార్తె ఏపీ హోంమంత్రి అనితను కలిశారు.

Update: 2024-08-27 12:05 GMT

ఆంధ్రప్రదేశ్ లో అత్యంత సంచలనమైన అంశాల్లో, చర్చనీయాంశమైన అంశాల్లో మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఒకటనే సంగతి తెలిసిందే. ప్రధానంగా గత ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం చుట్టూ రాజకీయ ప్రసంగాలు సాగిన పరిస్థితి. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కాస్త తీవ్రత తగ్గినట్లు అనిపిస్తున్న నేపథ్యంలో... ఇటీవల వివేకా కుమార్తె ఏపీ హోంమంత్రి అనితను కలిశారు.

వైఎస్ షర్మిళ కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పినంత స్ట్రాంగ్ గా కాకపోయినా అప్పుడప్పుడూ ఈ విషయాన్ని ప్రస్థావిస్తున్నారు! ఇలా ఏపీలో మూడో ప్రభుత్వం కొలువైనా కూడా ఈ సమస్య ఇంకా సమస్యగానే ఉన్న పరిస్థితి అని అంటుంటారు! అయితే ఇప్పుడు రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఒకటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కచ్చితంగా ఫలితం వస్తుందని అంటున్నారు.

ఇటీవల రాష్ట్రంలోని పరిస్థితులపై శ్వేతపత్రాలు విడుదల సందర్భంగా స్పందించిన చంద్రబాబు కూడా... "హూ కిల్డ్ బాబాయ్" అనే ప్రశ్నకు సమాధానం త్వరలో దొరుకుతుందంటూ వ్యాఖ్యానించారు! ఈ సమయంలో వివేకానందరెడ్డి హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ ను కలిశారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలతో ఆయనకు ఓ ఫిర్యాదు చేశారు.

అవును... మాజీమంత్రి వివేకా హత్యకేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి తాజాగా కడపలో ఎస్పీ హర్షవర్ధన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఐదేళ్ల పాటు వైఎస్ జగన్, భరతి, అవినాష్ రెడ్డి తనను ఇబ్బంది పెట్టారని.. ఇదే సమయంలో భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడి తనను ఇబ్బందులకు గురిచేశారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో.. ఇప్పుడు ఈ ఆరోపణల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది!

ఈ సందర్భంగా స్పందించిన దస్తగిరి... 2023 నవంబర్ 29 తారీకున సీసిటీవీ ఫోటో ఏమైందనే విషయాన్ని తను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. అప్రూవర్ గా మారాననే కారణంతో... తనను భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి, అవినాష్ రెడ్డి, జగన్, భారతి.. గత ఐదేళ్లుగా ఇబ్బందులకు గురిచేశారని దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని.. వివేకా హత్య కేసులో రాజీ కావాలని డబ్బు ఆశ చూపారని.. తాను చైతన్యరెడ్డి మాట వినకపోవడంతోనే జైల్లో తనను హింసించారని దస్తగిరి చెప్పుకొచ్చారు. ఇక తాను జైల్లో ఉన్న సమయంలో సీసీ ఫుటేజ్ ని తొలగించారని.. ఈ వ్యవహారంపై విచారణ చేయాలని ఎస్పీకి, సీబీఐని కోరుతున్నట్లు తెలిపారు.

ఇదే క్రమంలో... వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబుకు ఛాలెంజ్ గా నిలుస్తుందని తాను భావిస్తున్నట్లు చెప్పిన దస్తగిరి... ఈ కేసుపై అసెంబ్లీలో సీఎం ప్రస్థావించారని, అది తాను చూశానని తెలిపారు. వివేకా హత్యకేసులో తాను కూడా తప్పుచేసి ఉండోచ్చని, తనపై కూడా ఎటువంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చని.. తప్పుచేసిన వాడికి కచ్చితంగా శిక్ష పడాల్సిందే అని అన్నారు.

Tags:    

Similar News