కన్నతల్లికి కూతురు చిత్రహింసలు... సీఎంని ట్యాగ్ చేసిన వీడియో!

తల్లితండ్రులను పెద్దవయసు వచ్చిన తర్వాత కడుపులో పెట్టి చూసుకోని వారు కొంతమంది.. అనాథాశ్రమాల్లో వదిలి వెళ్లేవాళ్లు మరికొంతమంది అని చెబుతున్నారు.

Update: 2025-02-27 18:59 GMT

తల్లితండ్రులను పెద్దవయసు వచ్చిన తర్వాత కడుపులో పెట్టి చూసుకోని వారు కొంతమంది.. అనాథాశ్రమాల్లో వదిలి వెళ్లేవాళ్లు మరికొంతమంది అని చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఇంట్లో నుంచి పేరెంట్స్ ని బయటకు పంపడంతో.. ఆ వృద్ధులు రోడ్లపై బిక్షాటక చేసుకుంటూ కనిపించిన విషయాలు తెరపైకి వచ్చాయి.

ప్రస్తుతం పరిస్థితులు ఆ స్థాయిలో మారిపోయాయని అంటున్నారు. ఈ సమయంలో.. తల్లితండ్రులను కడుపులో పెట్టుకుని చూసుకోకపోయినా పర్లేదు.. కనీసం సాటి మనిషిగా చూసినా చాలని కోరుకునేవారూ ఉన్నారని అంటారు. ఈ సమయంలో తాజాగా తన కన్న తల్లిని అత్యంత దారుణంగా కొడుతున్న ఓ మహిళ వీడియో వెలుగులోకి వచ్చింది.

అవును... హర్యానాలోని ఓ మహిళ తన తల్లిని కొట్టిన దిగ్భ్రాంతికరమైన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది! దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో.. వెంటనే ఇది వైరల్ గా మారింది. అయితే.. ఈ ఘటన ఎప్పుడు జరిగింది, కచ్చితంగా ఎక్కడ జరిగిందనేది మాత్రం తెలియాల్సి ఉంది.

ఈ సమయంలో తన తల్లిని దుర్భాషలాడుతూ, శరీరంపై అక్కడక్కడా కరుస్తూ, జుట్టు పట్టుకుని కొడుతూ, తన్నుతున్న దారుణాలు ఈ వీడియోలో కనిపించింది. మూడు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియో అత్యంత పాశవికంగా ఉందనే కామెంట్లు కనిపిస్తున్నాయి. ఈ సంఘటనను ఎవరు చిత్రీకరించారో కూడా తెలియాల్సి ఉంది.

ఈ వీడియో చిత్రీకరించేవారు బాధితురాలికి సహాయం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదనే విషయాన్ని పలువురు లేవనెత్తుతున్నారు. ఈ సమయంలో.. అత్యంత కౄరంగా దాడికి పాల్పడినట్లు కనిపిస్తున్న ఆ మహిళపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు.. తమ పోస్టులకు హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైనీని ట్యాగ్ చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News