దావూద్ పై విషప్రయోగం..? చావుబతుకుల్లో మాఫియా డాన్.. అసలేమైందంటే?
కానీ దావూద్ కరాచీలోనే ఉన్నాడని ఆయన సోదరి హసీనా పార్కర్ కొడుకు (దావూద్ మేనల్లుడు) అలీషా పార్కర్ చెప్పినట్లు జాతీయ దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి.
అండర్ వరల్డ్ డాన్ దావూద్ అంటే ప్రపంచం మొత్తం తెలుసు.. కానీ అందులో భారత్ కు మాత్రం కొంచెం ఎక్కువగానే తెలుసు. దావూద్ దేశంలో సృష్టించిన గందరగోళం అంతా ఇంతా కాదు. చిన్న గ్యాంగ్ స్టర్ గా ఎదిగిన దావూద్ ఇబ్రహీం చాలా ఏళ్లపాటు ముంబైని ఏలాడనే చెప్పవచ్చు. అండర్ వరల్డ్ డాన్ గా గుర్తింపు సంపాదించుకుంటూ ఇటు ఎన్ఐఏ, అటు పోలీసుల కళ్లు కప్పడంలో ధిట్ట.
ముంబై బాంబు పేలుళ్లలో సూత్రధారిగా ఉన్నారు దావూద్ ఇబ్రహీం. 1993లో జరిగిన ఈ పేలుళ్త తర్వాత ఆయన దేశం విడిచి వెళ్లిపోయారు. అయితే ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేయగా ఆయన పొరుగున ఉన్న దాయాది దేశం పాకిస్తాన్ కు వెళ్లినట్లు గుర్తించారు. కానీ ఇప్పటి వరకు దావూద్ ఇబ్రహీం తమ దేశంలో ఉన్నాడన్న విషయాన్ని ఆ దేశం ఇప్పటికీ ధ్రువీకరించలేదు. కానీ దావూద్ కరాచీలోనే ఉన్నాడని ఆయన సోదరి హసీనా పార్కర్ కొడుకు (దావూద్ మేనల్లుడు) అలీషా పార్కర్ చెప్పినట్లు జాతీయ దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి.
కరాచీలోని ఎయిర్ పోర్ట్ దావూద్ ముఠా ఆధీనంలో ఉందని ఎన్ఐఏ చెప్తుంది. దావూద్ ఇబ్రహీంను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. 2018 విడుదల చేసిన అంతర్జాతీయ ఉగ్ర సంస్థల్లో దావూద్ కంపెనీ, ఉగ్రవాదుల పేర్లలో దావూద్ పేరు ఉంది. అయితే ఆయన అడ్రస్ గా కరాచీని చూపించాడు. అయితే పాక్ మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు.
దావూద్ పై విష ప్రయోగం జరిగిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితం అయ్యాయి. దీంతో ఆయన పాక్ రాజధాని కరాచీలోకి ఒక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా తెలిపింది. అయితే ఆయనను ఉంచిన హాస్పిటల్ లో ఒక ఫ్లోర్ మొత్తం దావూద్ మనుషులు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఫ్లోర్ లోకి దావూద్ కుటుంబ సభ్యులు, వైద్యులు తప్ప ఎవరికీ ప్రవేశం కల్పించడం లేదు. అయితే ఇప్పటి వరకు పాకిస్తాన్ మాత్రం దీన్ని ధ్రువీకరించడం లేదు. ఈ ఘటనపై దావూద్ సమీప బంధువుల నుంచి సమాచారం సేకరించేందుకు ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇక పాకిస్తాన్ లో ఆదివారం (డిసెంబర్ 17) అర్థరాత్రి నుంచే ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగిందని తెలుస్తోంది. ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా వెబ్ సైట్లు డౌన్ అయ్యాయని, ఇక ప్రధాన నగరాలైన కరాచీ, రావల్పిండి, లాహోర్ లలో ఇంటర్నెట్ సేవలు పూర్తి నిలిచిపోయినట్లు ఇంటర్నేషనల్ మీడియా కథనాలలో పేర్కొంది.