డెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి... కారణం ఇదే!

ఈ దాడికి సంబంధించిన వీడియోను సదరు మీడియా సంస్థ ఎక్స్ లో పోస్ట్ చేసింది.

Update: 2024-07-10 14:43 GMT

ఏపీలో తాజాగా ఓ మీడియా సంస్థపై దాడి జరిగింది. ఇందులో భాగంగా... "విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కూటమి యూటర్న్" అని అంటూ ఓ ఆంగ్ల దినపత్రికలో కథనం ప్రచురితమవ్వడమే ఈ దాడికి కారణం అని తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియోను సదరు మీడియా సంస్థ ఎక్స్ లో పోస్ట్ చేసింది.

అవును.. "అలయన్స్ టేక్స్ యూ-టర్న్ ఆన్ వీ.ఎస్‌.పీ ప్రైవేటైజేషన్" అనే శీర్షికతో ఓ కథనం డెక్కన్ క్రానికల్ ఆంగ్ల దినపత్రికలో ప్రచురితమైంది. దీంతో... ఆగ్రహించిన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు ఆ పత్రికాఫీసుపై దాడి చేశారు. ఈ సందర్భంగా డీసీ ఆఫీసులో ఫర్నిచర్ ధ్వంసం చేశారని తెలుస్తోంది.

"వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై కూటమి యూటర్న్" అనే శీర్షికతో కథనం రావడమే దీనికి కారణం అని అంటున్నారు. దీనిపై ఆగ్రహం చెందిన టీ.ఎన్.ఎస్.ఎఫ్., తెలుగు మహిళా శ్రేణులు పత్రికా కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అనంతరం ఆఫీసు ముందున్న బోర్డును తగులబెట్టారు.

ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను “ఎక్స్” లో పోస్ట్ చేసింది డెక్కన్ క్రానికల్. ఈ సందర్భంగా... ఈ దాడిని ఖండిస్తూ, ఇలాంటి బెదిరింపులకు భయపడబోమని డీసీ విలేఖరులు తెలిపారు. అతిపెద్ద మ్యాన్ డేట్ హింసకు లైసెన్స్ కాదని అన్నారు!

Tags:    

Similar News