అంబానీ, కొహ్లీ లతో ప్రమోట్ చేస్తున్న యాప్స్ లో పెట్టుబడి పెడుతున్నారా?

సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న దశలో ఇప్పుడు డీప్ ఫేక్ ఎంటరవ్వడంతో సమస్య మరింత జటిలమైందనే మాటలు వినిపిస్తున్నాయి

Update: 2024-10-09 03:55 GMT

సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న దశలో ఇప్పుడు డీప్ ఫేక్ ఎంటరవ్వడంతో సమస్య మరింత జటిలమైందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ, టీం ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ వంటి ప్రముఖులతో చేస్తున్న డీప్ ఫేక్ ఇన్ వెస్ట్ మెంట్ స్కాం బయటపడింది!

అవును... భారత్ తో పాటు పాకిస్తాన్, నైజీరియా, సౌదీ అరేబియా వంటి దేశాలలో ప్రజలను మోసం చేయడానికి ప్రముఖుల డీఫ్ ఫేక్ ప్రకటనలతో భారీగా ఫిషింగ్ డొమైన్లు క్రియేట్ చేయబడుతున్నాయని 'క్లౌడ్ సెక్' తాజా నివేదికలో వెల్లడించింది. ఈ స్కామ్ లలో ప్రసిద్ధ న్యూస్ రీడర్స్ తో కూడ్దా చీకటి జూదం యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

అధునాతన డీఫ్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రూపొందిస్తున్న వీడియోల్లో పైన చెప్పుకున్న సెలబ్రెటీల రూపాలు, వారి వారి వాయిస్ లను ఫెర్ ఫెక్ట్ గా సెట్ చేస్తున్నారు. దీంతో వారిపై ఉన్న నమ్మకం వీరి మోసాలకు పెట్టుబడిగా మారిందని అంటున్నారు. ప్రధానంగా "ఏవియేటర్" వంటి యాప్ లు వినియోగదారులకు పెట్టుబడిని అనేక రెట్లు పెంచుతామనే నకిలీ వాగ్ధానాలు చేస్తున్నాయని అంటున్నారు.

ప్రస్తుతం ఆన్ లైన్ లో విస్తృతంగా ప్రసారం అవుతున్న వీడియోలో.. అంబానీ డీప్ ఫేక్ స్పందిస్తూ.. తమ నిజాయితీ గల యాప్ ఇప్పటికే భారత్ లో వేలాది మందికి డబ్బు సంపాదించడంలో సహాయపడిందని.. ఇక్కడ గెలిచే అవకాశం 95% ఉందని ప్రకటించగా.. ఇంతలో ఈ యాప్ ను కొహ్లీ ఆమోదించినట్లు చూపబడింది. తాను వ్యక్తిగతంగా ఈ యాప్ ను సిఫారస్ చేసినట్లు కొహ్లీ చెబుతుండటం కనిపిస్తుంది!

ఇటువంటి తప్పుడు ప్రామిస్ లు సులభమైన ఆర్థికలాభాలను కోరుకునే వీక్షకుల ఆకాంక్షలను వేటాడతాయని.. చివరికి ఈ డీఫ్ ఫేక్ పెట్టుబడి మోసాల బారిన పడి చాలా మంది ఉన్న డబ్బును పోగొట్టుకుని.. ఆర్థిక కష్టాలను కొని తెచ్చుకుంటారు. అందువల్ల... ఈ డీఫ్ ఫేక్ ప్రకటనల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News