కేజ్రీవాల్ అద్దాల మేడలో జిమ్, స్పా... బీజేపీ వీడియో వైరల్!
దేశంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. మరికొద్ది నెలల్లో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
దేశంలో మరోసారి అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. మరికొద్ది నెలల్లో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో "సీఎం బంగ్లా" వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనను తాను సామాన్యుడిగా చెప్పే మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇల్లు ఇంద్ర భవనం అన్నట్లు చెబుతూ బీజేపీ పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
అవును... తనను తాను సామాన్యుడిగా చెప్పుకునే ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. అధికారంలో ఉన్న సమయంలో రూ.కోట్లు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి నివాసానికి మార్పులు చేశారంటు భారతీయ జనతాపార్టీ గత కొంతకాలంగా ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా దానికి సంబంధించిన వీడియోను విడుదల చేయడం సంచలనంగా మారింది.
తాజాగా ఎక్స్ లో ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్ దేవ ఓ వీడియో పోస్ట్ చేశారు. ఇందులో భాగంగా... ఢిల్లీలోని 6 ఫ్లాగ్ స్టాఫ్ రోడ్ లో ఉన్న ఢిల్లీ సీఎం బంగ్లా వీడియో అది.. దీన్ని గతంలో అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా వినియోగించారని పేర్కొన్నారు. దీన్ని అద్దల మేడగా అభివర్ణించారు బీజేపీ నేత.
ఇదే సమయంలో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన 7-స్టార్ రిసార్ట్ నిర్మించుకున్నారు అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఇదే సమయంలో... ఈ బంగ్లాలో మార్బుల్ గ్రానైట్ లైటింగ్ కోసం రూ.1.9 కోట్లు, ఇతర సివిల్ వర్క్స్ కోసం రూ.1.5 కోట్లు, జిమ్, స్పా కోసం రూ.35 లక్షలు... ఇలా మొత్తంగా సుమారు రూ.3.75 కోట్లు ఖర్చు చేసి ఈ భవనాన్ని లగ్జరీగా మార్చుకున్నారని ఆరోపించారు.
ఈ ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. ఇందులో భాగంగా... అసలైన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేసుకు బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ సీనియర్ నేత మనీశ్ సిసోడియా మండిపడ్డారు. విద్య, ఆరోగ్య సంస్కరణల గురించి అడుగుతుంటే.. వారు మాత్రం బంగ్లాల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
మరోపక్క ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు ఇలాంటి వీడియోలు, ఆడియోలతో బీజేపీ రాజకీయం మొదలుపెడుతుందని.. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లోనూ కొన్ని ఆడియోలు వినిపించగా.. ఎలక్షన్ తర్వాత అవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో చేసినట్లు నిరూపణ అయ్యిందని.. అప్పటికె వారు ప్రతిఫలం పోందగా, ప్రత్యర్థులకు డ్యామేజ్ జరిగిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయని అంటున్నారు.
ఆటో డ్రైవర్లకు అరవింద్ కేజ్రీవాల్ వరాలు!:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అరవింద్ కేజ్రీవాల్ కీలక్ స్టెప్ తీసుకున్నారు.. ఆటో డ్రైవర్లకు వరాల జల్లులు కురిపించారు. ఇందులో భాగంగా.. ఒక్కో ఆటో డ్రైవర్ కు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా తో పాటు ఆటో డ్రైవర్ కూతురి పెళ్లికి రూ.1 లక్ష సాయం చేస్తామని తెలిపారు. ఇదే సమయంలో.. ప్రతీ దీపావళి, హోలీ పండగలకి రూ.2,500 ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు!