భర్త గ్యాంగ్ స్టర్.. తల్లి సెక్స్ రాకెట్.. తండ్రి డ్రగ్స్ రవాణా.. ఎవరీ లేడీ డాన్?

ఈ నేపథ్యంలో లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ చేయాల్సిందంతా చేస్తోన్న ఓ లేడీ డాన్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు!

Update: 2025-02-21 08:30 GMT

ఫ్యామిలీలో ఎవరైనా ఒకరు తేడాగా ఉంటారు.. ఇప్పుడు చెప్పుకోబోయే ఎంటర్ ఫ్యామిలీ ఫ్యామిలీ తేడా! తల్లి సెక్స్ రాకెట్ నడిపిన కేసులో జైలుకెళ్లింది.. తండ్రి డ్రగ్స్ అక్రమ రవాణా చేసే నెట్ వర్క్ తో ప్రమేయం ఉన్న వ్యక్తి.. ఈమె భర్త గ్యాంగ్ స్టర్ తీహార్ జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ చేయాల్సిందంతా చేస్తోన్న ఓ లేడీ డాన్ ను తాజాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు!

అవును... గ్యాంగ్ స్టర్ అయిన భర్త తీహార్ జైల్లో ఉండటంతో.. అతడి నేర సామ్రాజ్యానికి అంతా తానై చూసుకుంటోంది.. పార్టీలు, లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తూ.. ఏమాత్రం ఆధారాలు దొరక్కుండా డ్రగ్స్ దందా నిర్వహిస్తూ ఢిల్లీలో రచ్చ రచ్చ చేస్తోంది. ఈమెను తాజాగా పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్ట్ చేశారు. జాతీయ మీడియాలో వస్తోన్న ఆ వివరాలు ఇప్పుడు చూద్దామ్..!

వివరాళ్లోకి వెళ్తే... ఈశాన్య ఢిల్లీలో పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు ఢిల్లీ గ్యాంగ్ స్టర్ హషీమ్ బాబా.. జోయా ఖాన్. ఈ క్రమంలో.. 2017లో వీరిద్దరూ ప్రేమవివాహం చేసుకున్నారు. ఫలితంగా.. షహీమ్ కు జోయా ఖాన్ మూడో భార్య కాగా.. జోయాకు హషీమ్ రెండో భర్త! ఈ క్రమంలో ఓ కేసులో హషీమ్ ను పోలీసులు అరెస్ట్ చేసి, తీహార్ జైలుకు పంపించారు. అప్పటినుంచి దందా మొత్తం తన చేతుల్లోకి తీసుకుంది జోయా ఖాన్!

ఈ క్రమంలో... భర్త కార్యకలాపాలకు ఏమాత్రం ఢోకా లేకుండా  దందాను చురుగ్గా నడపడం ప్రారంభించింది. ఈశాన్య ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తన భర్తకు అత్యంత నమ్మకస్తులై.. గ్యాంగ్ ను నడిపే నలుగురైదుగురు అనుచరులతో ఆమె దందాలు కంటీన్యూ చేస్తోంది. తనకు ఎక్కడా వ్యతిరేకంగా ఆధారాలు లేకుండా జాగ్రత్త పడేది. తీహార్ జైల్లో ఉన్న తన భర్తను కలిసేందుకు తరచూ వెళ్లేది.

ఇక.. హై ప్రొఫైల్ పార్టీలు, ఖరీదైన దుస్తులు, కార్లు, లగ్జరీ బ్రాండ్ లు ఆమె లైఫ్ స్టైల్ లో భాగం కాగా.. సోషల్ మీడియాలోనూ ఆమెకు ఎక్కువ ఫాలోయింగే ఉంది. ఈ సమయంలో... ఆమెపై నిఘా ఉంచిన పోలీసులు.. యూపీలోని ముజఫర్ నగర్ నుంచి ఢిల్లీకి హెరాయిన్ ను తీసుకొస్తుంటే.. పక్కా ప్లానింగ్ తో స్పెషల్ బ్రాంచ్ అరెస్ట్ చేసింది.

ఈ సమయంలో జోయా ఖాన్ వద్ద సుమారు 270 గ్రాముల హెరాయిన్ ను పట్టుకున్నట్లు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో దీని విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోపక్క తీహార్ జైల్లో ఉన్న ఈమె భర్త హషీమ్ బాబాకు బిష్ణోయ్ గ్యాంగ్ తో పరిచయాలున్నాయని అంటున్నారు.

Tags:    

Similar News