'బిజినెస్ మేన్' సినిమాలా జరుగుతుందా?
అవును... దేశ రాజధాని ఢిల్లీలోని వ్యాపారులకు వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట. విదేశాల్లోని గ్యాంగ్ స్టర్లు, వారి అనుచరుల నుంచి రోజుకో బెదిరింపు కాల్ వస్తుందని
మహేష్ బాబు నటించిన పూరీ చిత్రం "బిజినెస్ మేన్" చాలా మందికి గుర్తుండే ఉంటుంది. ముంబైని పోయించడానికి వచ్చానని చెప్పిన ఆ సినిమాలోని హీరో ఓ టీమ్ ని ఫామ్ చేసుకుని.. బడా బడా వ్యక్తులకు ఫోన్స్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తుంటారు. ప్రస్తుతం ఢిల్లీలో వ్యాపారులు ఇలాంటి ఫోన్ కాల్స్ తో హడలెత్తిపోతున్నారని అంటున్నారు.
అవును... దేశ రాజధాని ఢిల్లీలోని వ్యాపారులకు వరుసగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట. విదేశాల్లోని గ్యాంగ్ స్టర్లు, వారి అనుచరుల నుంచి రోజుకో బెదిరింపు కాల్ వస్తుందని, బడా వ్యాపారులే లక్ష్యంగా ఈ పనికి పూనుకుంటున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా స్పందించిన పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు!
ఇందులో భాగంగా... రియల్ ఎస్టేట్ వ్యాపారులు, నగల వ్యాపారులు, కార్ల షోరూమ్ ల యజమానులు మొదలైనవారికి గ్యాంగ్ స్టర్లు, వారి అనుచరుల నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ఈ క్రమంలో ఈ ఏడాది గత నెల నాటికి ఇలాంటి ఫోన్ కాల్స్ సుమారు 160 వరకూ వచ్చాయని తెలిపారు!
ఉదాహరణకు... ఇటీవల రోహిణీ ప్రంతంలోని ఓ వ్యాపారికి చెందిన షోరూమ్ లోకి ముగ్గురు వ్యక్తులు చొరబడి గాల్లోకి పలు రౌండ్లు కాల్పులు జరిపారని.. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పి వారికి రూ.10 కోట్లు ఇవ్వాలని రాసి ఉన్న కాగితాన్ని అక్కడ వదిలి వెళ్లారని తెలిపారు. మరో కేసులో జిమ్ యజమాని నుంచి రూ.7 కోట్లు డిమాండ్ చేశారని చెబుతున్నారు.
ఈ సమయంలో... స్పందించిన బాధితులు లారెన్స్ బిష్ణోయ్ సహచరుడు, గ్యాంగ్ స్టర్ దీపక్ బాక్సర్ అనుచరులుగా ఉండగులు వారి గురించి పేర్కొన్నారని పోలీసులకు తెలిపారు! బెదిరింపు కాల్స్ కూడా ఇంటర్నేషనల్ ఫోన్ నెంబర్స్ నుంచి వస్తున్నాయని అంటున్నారు. ఇలా కొంతమందికి ఫోన్ కాల్స్ కాకుండా.. నేరుగా ఇళ్లు, ఆఫీసులపై కాల్పులు జరిపి బెదిరిస్తున్నారని చెబుతున్నారు.
దీంతో... ఇలా బెదిరింపులకు పాల్పడేవారిని పట్టుకునేందుకు ప్రత్యేక సెల్, ప్రత్యేక క్రైమ్ బ్రాంచ్ ను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. కాగా... ఇటీవల ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీ ని హత్య చేసిన అనంతరం లారెన్స్ బిష్ణోయ్ పేరు ఎక్కువగా వినిపిస్తుండగా.. ఇదే సమయంలో మిగిలిన గ్యాంగ్స్ కూడా యాక్టివేట్ అయ్యి ఇలాంటి పనులకు పాల్పడుతున్నాయనే చర్చ జరుగుతుంది.