రామోజీకి 'భారత రత్న' పెరుగుతున్న గళాలు!
మొత్తంగా రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్లు.. గళాలు పెరుగుతుండడం గమనార్హం.
రామోజీ గ్రూపు సంస్థల అధినేత, ఈనాడు అధిపతి రామోజీరావు.. శనివారం ఉదయం అస్తమించారు. అనారోగ్య కారణాలతో ఆయన ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. అశేష తెలుగు ప్రజానీకానికి.. సూర్యోద యం ముందే.. సమస్త ప్రపంచ వార్తలను చేతికి అందించిన అక్షరయోధుడుగా ఆయన చరిత్ర సృష్టిం చారు. ఆయనకు సినీ రంగం మొత్తం ఘన నివాళులర్పిస్తోంది. దర్శక దిగ్గజాల నుంచి సంగీత దర్శకుల వరకు కూడా.. అందరూ మీడియా మహా సామ్రాజ్యాధినేతకు కడసారి నివాళులర్పిస్తున్నారు.
ఈ సమయంలో దర్శక దిగ్గజం.. రాజమౌళి.. సంచలన ప్రకటన చేశారు. రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలని.. ఆయన ఆ అర్హతను ఏనాడో దాటేశారని.. మనమే గుర్తించడంలో వెనుకబడ్డామని వ్యాఖ్యానిం చారు. ఇప్పటికైనా ఆయనకు భారత రత్న ప్రకటించాలని సూచించారు. ఇక, ఇదే విషయంపై అగ్ర నటుడు బన్నీ కూడా.. స్పందించారు. రామోజీరావుకు భారత రత్న ఇవ్వాలనేది తన మనసులోని మాట కూడా అని వ్యాఖ్యానించారు.మొత్తంగా రామోజీరావుకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్లు.. గళాలు పెరుగుతుండడం గమనార్హం.
రత్నానికి మించిన అర్హతలు!
+ భారత రత్న అవార్డుకు ఏవైనా అర్హతలు ఉన్నాయనిఅనుకుంటే... నిజంగానే ఆయా అర్హతలను మించి రామోజీ కష్టపడ్డారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
+ దివిసీమ ఉప్పెనతో కృష్ణాజిల్లాలోని 12 మండలాలు కొట్టుకుపోయినప్పుడు.. ఈ దేశాన్ని చైతన్యం చేసి.. బాధితులను ఆదుకునేలా చేశారు రామోజీ.
+ గుజరాత్‌లోని భుజ్‌లో భూకంపం సంభవించి.. 2000 మంది మృత్యువాత పడినప్పుడు.. మేమున్నాం అంటూ.. ఆదుకున్నారు.
+ తమినాడు సునామీలో చివురుటాకులా వణికి పోయినప్పుడు.. తెలుగు వారి తరఫున చందాలు వసూలు .. చేసి.. ఒక పట్టణమే కట్టించి ఇచ్చారు రామోజీ.
+ కేరళకు విపత్తు సంభవించినప్పుడు కూడా..ఆదుకున్నారు.
+ ఒడిశాలోనూ.. తుఫాను బాధిత ప్రాంతాలు కొట్టుకుపోగా.. పక్కా ఇళ్లు నిర్మించి ఆదుకున్నారు.
+ ఏ విపత్తు వచ్చినా.. మేమున్నామంటూ.. ముందుకు వచ్చిన రామోజీ.. విశాఖలో హుద్ హుద్ తుఫాను వచ్చినప్పుడు కూడా.. అంతకు రెండింతలు దీటుగా స్పందించి.. ఆదుకున్నారు..
+ ప్రకృతి విపత్తులు సంభవించాక చేతులు ఎత్తడం కాదు.. ముందే వాటిని నివారించే మార్గాలు చూడాలంటూ.. వివిధ దేశాల్లో చేపడుతున్న కార్యక్రమాలను అక్షరీకరించి.. పాలకులకు చైతన్యం రగిలించారు. ఇలా.. సమాజం కోసం.. కృషి చేసిన రామోజీ.. నిజంగానే భారతరత్న అర్హతను ఏనాడో దాటిపోయారు.