కుర్చీకి నిండుదనం: చంద్రబాబు ఇంట్రస్టింగ్ కామెంట్స్
అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును ఉద్దేశించి ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుర్చీకే నిండుదనం వచ్చిందని కొనియాడారు. ఈ సమయంలో సభలో ఒక్కసారిగా నవ్వులు వెల్లివిరిశాయి. సుమారు గంటన్నర సేపు సుదీర్ఘంగా ప్రసంగించిన చంద్రబాబు అనేక అంశాలను ప్రస్తావించారు. వైసీపీ హయాం నుంచి ప్రస్తుత కూటమి పాలన వరకు అన్ని విషయాలను చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా వచ్చే భవిష్యత్తును కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాల గురించి మాట్లాడుతున్న సమయంలో మరోసారి `పందులు` అంటూ వైసీపీ పాలనను ఉదహ రించారు. ఈ సందర్భంగా సభాపతి స్థానంలో రఘురామ కూడా.. ``మీ ఊళ్లో పది పందులే ఉన్నాయి.. మా దగ్గర వందల సంఖ్యలో పందులు వున్నాయి`` అని వ్యాఖ్యానించడంతో చంద్రబాబు ముసిముసిగా నవ్వుకున్నారు.
తన సుదీర్ఘ ప్రసంగంలో రఘురామను కూడా వదిలి పెట్టకుండా.. సొంత ఎంపీ అన్న కనికరం కూడా లేకుండా.. వైసీపీ ప్రభుత్వం హింసించిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అనంతరం.. సభకు నిండుద నం వచ్చిందని.. ఈ సభనుసజావుగా నడిపించాలని సూచించారు. ``మెరుస్తున్న దుస్తులే కాదు.. కుర్చీ కూడా మెరుస్తోంది. దానికొక నిండుదనం వచ్చింది. చాలా హుందాగా ఉన్నారు. ఇదే హుందాతో సభను కూడా హుందాగా నడిపించాలి. అందరూ మీకు సహకరించేందుకు రెడీగా ఉన్నారు`` అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
కాగా, శుక్రవారం ఉదయం నుంచి సభలో ఎక్కువ సేపు రఘురామరాజే ఉండడం గమనార్హం. దీనిపై కూ డా.. చంద్రబాబు స్పందిస్తూ.. మీకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి! అని సూచించా రు. మొత్తంగా.. సభలో రఘురామరాజును పొగడ్తలతో ముంచెత్తుతున్న సమయంలో సభ మొత్తం సంతోషంలో మునిగిపోవడం గమనార్హం.