డిప్యూటీ స్పీకర్ కాబోతూ రఘురామ షాకింగ్ కామెంట్స్
ఆయన తన తొలి చివరి ప్రసంగం ఈ సందర్భంగా అసెంబ్లీలో చేశారు. ఆయన బడ్జెట్ మీద మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఊహించిన దాని కంటే భయంకరంగా ఉందని అన్నారు.
టీడీపీకి చెందిన ఉండి శాసనసభ్యుడు రఘురామ క్రిష్ణం రాజు డిప్యూటీ స్పీకర్ కాబోతున్నారు. ఆయన తన తొలి చివరి ప్రసంగం ఈ సందర్భంగా అసెంబ్లీలో చేశారు. ఆయన బడ్జెట్ మీద మాట్లాడుతూ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఊహించిన దాని కంటే భయంకరంగా ఉందని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్ధిక మంత్రి పయ్యవుల కేశవ్ లకు నిద్ర లేని రాత్రులే అని కూడా అన్నారు. బడ్జెట్ ని చూస్తే బాబు దక్షత ఏంటో అందరికీ అర్ధం అవుతోందని అన్నారు. బడ్జెట్ ని ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో పెట్టారు అంటే అది బాబు కే సాధ్యం అన్నారు.
ఏపీలో ఆర్ధిక పరిస్థితి సవ్యంగా అయితే లేదని కోలుకోవడానికి కూడా చాలా టైం పడుతుందని ఆయన అన్నారు. అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం బాగానే అడుగులు వేస్తోందని, సంక్షేమం విషయంలో అదే విధంగా బ్యాలెన్స్ చేయాలని సూచించారు.
కాస్తా ముందూ వెనకా అయినా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మొత్తానికి రఘురామ చెబుతున్న మాటలు చూస్తే ఏపీలో ఆర్ధిక పరిస్థితి భయానకంగానే ఉందని అంటున్నారు.
బడ్జెట్ లో పేర్కొన్న వాటిని కానీ అలాగే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ఎలా నెరవేరుస్తారు అన్నది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు. ఏపీలో అప్పులు ఎక్కువగా గత ప్రభుత్వం చేసిందని ఇంకా లక్ష కోట్ల రుణాన్ని తేవడానికి చూస్తే తానే కేంద్రానికి లేఖలు రాయడం ద్వారా అడ్డుకున్నాను అని రఘురామ ఫ్లాష్ బ్యాక్ విషయాలను కూడా చెప్పారు.
మొత్తం మీద చూస్తే రఘురామ వైసీపీ ప్రభుత్వం అయిదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి విధ్వంసం చేసిందని ఆరోపించారు. ఇది రాష్ట్రాన్ని తీవ్ర గాయాల పాలు చేసిందని దాని నుంచి కోలుకోవడం అంటే కష్టమే అన్న బాధను ఆవేదను వ్యక్తం చేశారు. మరి ఈ నేపథ్యంలో కూటమి అధినేతగా ఉన్న చంద్రబాబు కానీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ కానీ ఎలా నిభాయించుకుని వస్తారో చూడాల్సి ఉందని అంటున్నారు.