ఇది మామూలు ముందు చూపు కాదు... అంబానీకే టెండర్!

ఈ సందర్భంగా ఏకంగా రిలయన్స్ కంపెనీనే డిమాండ్ చేసేటంత పనిచేశాడు! ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

Update: 2024-10-25 03:48 GMT

కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అని అంటారు.. ముందుచూపు ఉన్నా కూడా అవుతారని చెబుతుంటారు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఓ యాప్ డెవలపర్ తన ముందు చూపుతో వార్తల్లో నిలిచాడు. ఈ సందర్భంగా ఏకంగా రిలయన్స్ కంపెనీనే డిమాండ్ చేసేటంత పనిచేశాడు! ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

అవును... జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లను విలీనం చేయాలని చూస్తున్న తరుణంలో ఈ రెండు పేర్ల కలయికతో ముందుగానే ఓ డొమైన్ కొనుగోలు చేశాడు ఓ యాప్ డెవలపర్. అయితే... అతడి ముందు చూపుకు తగ్గట్లుగానే ఇప్పుడు జియో, హాట్ స్టార్ విలీనం ఖరారైంది. అయితే.. జియో హాట్ స్టార్. కామ్ డొమైన్ మాత్రం ఇతడి దగ్గర ఉండిపోయింది.

ఈ సమయంలో... ఏడాది కిందటే ఈ డొమైన్ ను కొనుగోలు చేస్తూ.. దీనికి గల కారణాలను వివరిస్తూ రిలయన్స్ కు లేఖ రాశాడు. ఇందులో భాగంగా... ఐపీఎల్ స్ట్రీమింగ్ హక్కులను కోల్పోయిన డిస్నీ హాట్ స్టార్.. యూజర్లను కోల్పోయింది.. దీంతో.. హాట్ స్టార్ ను ఇతర కంపెనీల్లో విలీనం చేయాలని డిస్నీ పరిశీలించింది అని పేర్కొన్నాడు.

దీనికి సంబంధించి చాలా కాలంగా వార్తలూ వెలువడ్డాయి.. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో సినిమాలో విలీనం అయ్యే అవకాశాలూ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో మ్యూజిక్ స్ట్రీమింగ్ సర్వీస్ సావన్.కామ్ ను కొన్న తర్వాత దాని పేరు జియోసావన్.కామ్ గా అయినట్లే ఇప్పుడు ఇది కూడా జియోహాట్ స్టార్.కామ్ గా మారుతుందని ఊహించినట్లు తెలిపారు.

ఈ క్రమంలో... తన ఉనంత చదువుల కల నెరవేర్చుకోవడం కోసమే ఈ డొమైన్ కొన్నట్లు పేర్కొన్న ఈ డెవలపర్.. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో చదువుకోవాలనేది తన కల అని.. తన ఈ.ఎం.బీ.ఏ. ప్రోగ్రాం ట్యూషన్ ఫీజు కోసం సుమారు కోటి రూపాయలు ఇవ్వాలనే అభ్యర్థనను రిలయన్స్ తిరస్కరించిందని చెప్పుకొచ్చాడు.

రిలయన్స్ వంటి సంస్థకు తన ట్యూషన్ ఫీజు అనేది అత్యంత చిన్న ఖర్చని.. తన అభ్యర్థనను మరోసారి పరిశీలించాలని.. పేర్కొన్నాడు! ఇప్పుడు ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మరోపక్క చట్టపరమైన చర్యల దిశగా రిలయన్స్ ఆలోచన చేస్తోందని తెలుస్తోంది!

Tags:    

Similar News