కన్ఫాం... డ్రగ్స్ టెస్టులో రకుల్ బ్రదర్ కి పాజిటివ్!
ఈ సమయంలో ఆమన్ ప్రీత్ సింగ్ కి పోలీసులు డ్రగ్స్ టెస్ట్ చేయించారు. ఈ కేసుపై రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.
సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ ఎస్.ఓ.టీ, రాజేంద్రనగర్ సైబరాబాద్ పరిధిలో భారీగా డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో, సైబరాబాద్ ఎస్.ఓ.టీ, రాజేంద్రనగర్ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్ లో ఆమన్ ప్రీత్ సింగ్ ని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు.
అవును... డ్రగ్స్ కేసులో ఆమన్ ప్రీత్ సింగ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అతనికి నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ గా వచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో అరెస్ట్ చేసిన ఐదుగురిని అరెస్టు చేయగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
పరారీలో ఉన్న ఇద్దరి గురించి సమాచారం ఇస్తే రూ.2 లక్షల రివార్డు ఇస్తామని డీసీపీ ప్రకటించారు. అరెస్టయిన వారిలో ఇద్దరు నైజీరియన్లు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ సమయంలో రూ.35 లక్షల విలువైన 199 గ్రాముల కొకైన్ తోపాటు, రెండు పాస్ పోర్టులు, 10 సెల్ ఫోన్లు, 2 బైకులను సీజ్ చేశామని వెల్లడించారు.
అనౌహా బ్లెస్సింగ్ ఇక్కడికి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తుందని.. ఆమె ఇప్పటి వరకు 20 సార్లు నైజీరియా నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించామని తెలిపారు. అలా తీసుకొచ్చిన ఆమె దగ్గర 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు గుర్తించినట్లు శ్రీనివాస్ తెలిపారు. వారిలో ఆరుగురికి కొకైన్ టెస్టులో పాజిటివ్ వచ్చిందని అన్నారు.
వీరిపైనా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో పాజిటివ్ గా తేలిన వారిలో అమన్ ప్రీత్ సింగ్, అంకిత్, ప్రసాద్, నిఖిల్ తదితరులు ఉన్నారని డీసీపీ వివరించారు. విచారణ తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.