ఆ మాల సీక్రెట్ చెప్పేసిన స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా గొప్ప భక్తుడు అన్న సంగతి తెలిసిందే. అతడు క్రమం తప్పకుండా దైవ మాలలు ధరిస్తుంటాడు.
కోలీవుడ్ స్టార్ ధనుష్ కూడా గొప్ప భక్తుడు అన్న సంగతి తెలిసిందే. అతడు క్రమం తప్పకుండా దైవ మాలలు ధరిస్తుంటాడు. అయ్యప్ప కొండకి కాలినడకన మొక్కులు చెల్లిస్తుంటాడు. ఇంకా ఖాళీ సమయాల్లో దేవాలయాలకు వెళ్తుంటాడు. తాజాగా ఓ సందర్భంలో తనలో భక్తి భావం గురించి పంచుకున్నాడు. అదేంటో ఆయన మాటల్లోనే...` చిన్నప్పటి నుంచి నాకు భక్తి అంటే ఎక్కువే.
అమ్మతో కలిసి పూజలో కూర్చోవడం నాకెంతో ఇష్టం. ఆరేళ్ల క్రితం ఓ స్నేహితుడి సలహా మేరకు తమిళనాడులోని మధురైకి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలైమలై కొండల్లోని మురుగన్ ఆలయానికి వెళ్లినప్పుడు తెలియని అనుభూతి కలిగింది. సుబ్రమణ్య స్వామి ని పూజించి అక్కడ ఎంతో ప్రత్యేకంగా భావించే కరుంగలి మాలను ధరించా. కరుంగలి అంటే జమ్మిచెట్టు.
దాని కాండంతో తయారు చేసే ఆ మాలను వేసుకున్నాక నెగిటివీటీ దూరమైన భావన కలిగింది. అప్పటి నుంచి మాల వేసుకోవడం నాకు సెంటిమెంట్. షూటింగ్ సమయంల కూడా మాల తీయను. ఒత్తిడిగా ఉన్నా, మనసు సరిగ్గా లేకపోయినా, అనుకున్నది జరగకపోయినా కొండ మీదకు కాలి నడకన వెళ్లి స్వామి వారిని దర్శించుకోవడం నాకు ఎప్పటి నుంచో అలవాటు అయింది. అది అలా కొనసాగుతూనే ఉంటుంది` అని అన్నాడు.
అలాగే ధనుష్ శాఖాహారి. ఆ మధ్య టాలీవుడ్ లో నాన్ వెజ్ ప్రియుడని ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఓ ఈవెంట్ లో నాన్ వెజిటేరియన్ అని క్లారిటీ ఇచ్చాడు. ఇక నటుడిగా ధనుష్ స్థాయి గురించి చెప్పాల్సిన పనిలేదు. కమల్ హాసన్, విజయ్ సేతుపతి తరహాలో కోలీవుడ్ నుంచి గొప్ప నటుడిగా ధనుష్‌కి పేరుంది. `సార్` సినిమాతో టాలీవుడ్ లోనూ లాంచ్ అయిన సంగతి తెలిసిందే.