చిక్కడపల్లి స్టేషన్ లో అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారా..?
ఈ సందర్భంగా... ఇటీవల అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపైనే పోలీసులు ఎక్కువగా ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అల్లు అర్జున్ పోలీసు విచారణకు హాజరయ్యారు. ఉదయం 11:05 గంటల ప్రాంతంలో విచారణకు హాజరుకాగా.. మధ్యాహ్నం 2:47 గంటల వరకూ అంటే.. సుమారు 3:30 గంటల పాటు ఈ విచారణ జరిగింది!
ఈ సందర్భంగా... ఇటీవల అల్లు అర్జున్ మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపైనే పోలీసులు ఎక్కువగా ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో... ప్రధానంగా.. తొక్కిసలాటలో రేవతి చనిపోయిందనే విషయం మీకు తెలుసు కదా..? తర్వాత రోజు వరకూ తెలియదని మీడియాకు ఎందుకు చెప్పారు..? వంటి ప్రశ్నలు సంధించినట్లు చెబుతున్నారు.
ప్రధానంగా హైదరాబాద్ సిటీ పోలీసులు విడుదల చేసిన సుమారు 10 నిమిషాల వీడియోలో కనిపించిన దృశ్యాలు.. ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు కేంద్రంగా ఈ విచారణ జరిగిందనే చర్చా నడుస్తుందని అంటున్నారు. ఈ సమయంలో విచారణ సందర్భంగా అల్లు అర్జున్ కి సంబంధించిన ఓ ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.
అవును... నిన్న అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు సుమారు మూడున్నర గంటల పాటు విచారించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ‘పుష్ప-2’ సినిమా బెనిఫిట్ షో సందర్భంగా విచ్చేసిన సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు చూపించినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో అతడు ఎమోషనల్ అయినట్లు చెబుతున్నారు.
సంధ్య థియేటర్ లో తొక్కిసలాట వీడియోలను చూపిస్తూనే సుమారు 3 గంటల పాటు అల్లు అర్జున్ ని ప్రశ్నలు అడిగారని.. ఆ వీడియో చూస్తున్నప్పుడు.. రేవతి, శ్రీతేజ్ లు గాయపడిన దృశ్యాలను చూసినప్పుడు అల్లు అర్జున్ భావోద్వేగానికి లోనయ్యారని తెలుస్తోంది. ఈ విషయం ఆసక్తిగా మారింది!