వాలంటీర్లకు ప్రభుత్వం లాస్ట్ షాక్ ఇచ్చేసినట్లేనా..?

ఎన్నికల సమయంలో వారి జీతం రూ.5 వేల నుంచి రూ.10,000కు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు.

Update: 2024-11-28 06:33 GMT

ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల వ్యవస్థ పరిస్థితి అధ్వాన్నంగా అన్నట్లుగా మారిపోయింది! ఎన్నికలకు ముందు ఏపీలో వాలంటీర్లు హ్యూమన్ ట్రాఫికింగ్ కి సైతం సహకరిస్తున్నారంటూ కామెంట్లు వినిపించగా.. ఎన్నికల సమయంలో వారి జీతం రూ.5 వేల నుంచి రూ.10,000కు పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు.

అయితే... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీతం పెంచాలని, వారికి మంచి చేయాలని చూసినా.. వారికి సంబంధించి ఏ ఒక్క జీవో కూడా ప్రభుత్వ రికార్డుల్లో లేదని పవన్ కల్యాణ్ తెలిపారు. అనంతరం.. వీరికి సంబంధించిన జీవోల వివరాలను వైసీపీ ఎక్స్ వేదికగా విఫులంగా వివరించింది.

ఈ నేపథ్యంలో వాలంటీర్ల కెరీర్ పూర్తి గందరగోళంలో పడిందని అంటున్నారు. ఈ క్రమంలో వాలంటీర్లు ఇటీవల ధర్నాలు చేపట్టారు. తమను విధుల్లోకి తీసుకోవాలని.. ఎన్నికల సమయంలో ఇచ్చిన 10వేల రూపాయల హామీని నెరవేర్చాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ సమయంలో వాలంటీర్లకు మరో బిగ్ షాక్ తగిలింది.

అవును... తాజాగా వాలంటీర్లు ప్రతి రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో వరైకి కేటాయించిన యాప్ లో హాజరు చేసుకుంటారు. దీంతో... ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను వాయిదాల పద్దతిలో క్లియర్ చేస్తున్నట్లుంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి వాలంటీర్ల వ్యవస్థను వైసీపీ ప్రభుత్వమే రద్దు చేసిందంటూ ఇటీవల మండలిలో మంత్రి బాలవీరాంజనేయస్వామి తెలిపారు! అసలు వాలంటీర్ వ్యవస్థే లేదన్న ఆయన.. గత ప్రభుత్వం ఆ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని తెలిపారు. 2023 సెప్టెంబర్ తోనే వాలంటీర్ల వ్యవస్థకు గడువు కాలం ముగిసిందని అన్నారు.

అందుకే ఏపీలో వాలంటీర్లకు జీతాలు ఇవ్వడం లేదని తెలిపారు. దీంతో... 2024 లో కదా చంద్రబాబు వాలంటీర్ల వేతనాలపై హామీ ఇచ్చింది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో.. ఈ వ్యవస్థ 2023 సెప్టెంబర్ లోనె లేకపోతే.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జూన్ లోనే ఫైనల్ క్లారిటీ ఇచ్చెయ్యొచ్చు కదా అని మరొకరు ప్రశ్నిస్తున్నారు.

అనవసరంగా వారికి లేనిపోని ఆశలు కల్పించడం.. స్కిల్ డెవలప్ మెంట్ చేస్తామని అనడం.. స్వయంగా డిప్యూటీ సీఎం పవనె రెండు మూడు సార్లు వాలంటీర్లకు మెరుగైన కెరీర్ ఇస్తామని చెప్పడం వంటివి ఎందుకని ప్రశ్నిస్తున్నారని అంటున్నారు! దీంతో... తమ జీతం 10వేలు అవుతుందని కలలు కంటూ ఉండకుండా వాలంటీర్లు మరో ఉద్యోగాలు చూసుకోవడమే మిగిలి ఉందని సూచిస్తున్నారు పరిశీలకులు!

Tags:    

Similar News