మోడీ హయాంలో శత్రువులు పెరుగుతున్నారా ?
అటు అమెరికా అయినా ఇటు రష్యా అయినా భారత్ మాట వినాలని చూస్తున్నాయి.
కేంద్రంలో నరేంద్ర మోడీ ఏలుబడిలో భారత్ కీరిత్ శిఖరాగ్రానికి చేరింది. భారత్ పాత్ర లేకుండా అంతర్జాతీయ వేదిక మీద ఏ కార్యక్రమం జరగడం లేదు. అగ్ర రాజ్యాలు ముఖ్య రాజ్యాలు అన్నింటికీ భారత్ కావాల్సిన దేశంగా ఉంది. అటు అమెరికా అయినా ఇటు రష్యా అయినా భారత్ మాట వినాలని చూస్తున్నాయి.
అదే విధంగా రష్యా ఉక్రెయిన్ మధ్య భీకరమైన పోరు సాగుతున్నా రెండు దేశాలూ భారత్ కి మిత్రులుగానే ఉంటూ వస్తున్నాయి. అదే విధంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య సమరం సాగుతున్నా ఆ రెండు దేశాలూ భారత్ కి దగ్గర అయినవే.
ఇలా మోడీ పదేళ్ళ ప్రధానమంత్రిత్వంలో దాదాపుగా తిరగని దేశమే లేదు. ఆఫ్రికన్ దేశాలకు జీ 20లో సభ్యత్వం ఇప్పించిన ఘనత కూడా మోడీ దక్కించుకున్నారు. అలాగే ప్రపంచ దేశాలకు కరోనా వేళ టీకాలు సరఫరా చేయడం ద్వారా భారత్ కీర్తిని పెంచారు.
ఇలా ఇన్ని చేసినా కొన్ని విషయాలో మాత్రం భారత తన పోరు తనదే అన్నట్లుగానే ఉంది. భారత్ కి పాకిస్తాన్ నిత్య శత్రువు. ఎందుకు అంటే భారత్ నుంచి విడిపోయిన దాయాది కాబట్టి. భారత్ మంచిని ఎపుడూ పాక్ కోరుకోవడం లేదు, ఆ సంగతి అందరికీ తెలుసు. ఇక మోడీ ప్రధాని అయ్యాక చైనాతో కూడా భారత్ ఈ ఇబ్బందులు వస్తున్నాయి. చైనా అంతవరకూ నెమ్మదిగా ఉందా లేక పరోక్షంగా గోతులు తవ్విందా అన్నది పక్కన పెడితే చైనా బోర్డర్ దాటుతోంది. అరుణాచల్ ప్రదేశ్ సహా లడఖ్ ప్రాంతాలు తమవే అని క్లెయిం చేస్తోంది.
ఆ వివాదం అలాగే ఉంది. ఇక చూస్తే మిత్రుడు అనుకున్న బంగ్లాదేశ్ లోనూ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అక్కడ భారత్ కి నేస్తంగా ఉండే షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలగొట్టి సైన్యం సహాయంతో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు అయింది. దాని వెనక చైనా ఉందా మరే దేశం ఉందా లేక అక్కడ మిలటరీ పాక్ సాయం తీసుకుని తమ రాజకీయాన్ని మార్చుకుందా అన్నది వేరే అంశాలు కానీ ఇపుడు కొత్తగా మరో పొరుగు దేశం ప్రత్యర్ధి పాత్రలోకి వెళ్ళిపోయింది.
ఈ విషయాలు ఇలా ఉంటే కెనడా భారత్ మీద కక్ష కట్టేసింది. ఎందుకో తెలియదు కానీ జీ 20 దేశాల సమావేశానికి భారత్ వచ్చిన కెనడా ప్రధాని ట్రూడో భారత్ మీద కక్ష గట్టినట్లుగా వ్యవహరించారు. తన సొంత విమానంలోనే ఆనాడు ఆయన భారత్ నుంచి వెళ్లారు
ఇక భారత్ లో ఖలీస్థాన్ పేరుతో ఉద్యమాన్ని చేయలను చూస్తున్న ఉగ్ర మూకలకు కెనడా మద్దతు ఇస్తోంది అని చెబుతున్నారు. అలా పంజాబ్ వేర్పాటు వాదులకు తన దేశంలో ఆతీధ్యం ఇస్తున్న కెనడా ప్రధాని భారత్ మీద నిప్పులు చెరుగుతున్నారు భారత్ వంటి పెద్ద దేశం పట్ల కూడా ఆయన లెక్కలేని తనంతో ప్రవర్తిస్తున్నారు అంటే వెనకాల వ్యూహాలు ఏమిటో అర్ధం కావడంలేదు అని అంటున్నారు
భారత్ తో మిత్రుత్వం కోరుకునే దేశాలు ఈ రోజు అంతర్జాతీయ సమాజంలో ఎక్కువగా ఉండగా శతృత్వాన్ని ట్రుడో కోరుకుంటున్నారు అంటే ఆయన అజెండా ఏమిటో తెలియాల్సి ఉంది. గతంలోనూ కెనడాతో భారత్ కి అంత సఖ్యత లేకున్నా ఇపుడు మరీ ఎదురు నిలిచి కెనడా చేస్తున్న ఈ రాజకీయం దౌత్యపరమైన దుర్నీతి భారత్ ని కలవరపెడుతోంది.
కెనడాకు భారత్ గట్టిగానే బదులిస్తోంది. కౌంటర్ చేస్తోంది. అయితే కెనడాతో ఎందుకు ఈ పేచీ వస్తోంది అన్నదే చూడాల్సి ఉంది. కెనడాలో స్థిరపడిన సిక్కులు ఎక్కువగా ఉంటారు. వారి ఓట్ల కోసమే ఈ రాజకీయం అని అంటున్నా భారత్ ప్రతిష్ట అంతర్జాతీయంగా వెలిగిపోతున్న దశలో కావాలనే కార్నర్ చేయడానికి ఈ ప్రయత్నాలు అని కూడా అంటున్నారు.
ఏది ఏమైనా కెనడా పోకడల పట్ల భారత్ ధీటుగానే బదులిస్తోంది. కేవలం నాలుగు కోట్ల జనాభా కలిగిన అతి చిన్న దేశం అయిన కెనడాతో భారత్ కి విభేదాలు వల్ల ప్రస్తుతానికి ఇబ్బందులు లేకపోయినా అంతర్జాతీయంగా అందరి నేస్తంగా అనిపించుకుంటున్న వేళ ఇది మచ్చగా మారుతోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే భారత దౌత్య నీతి విదేశాంగ విధానం భేష్ అని నిపుణులు చెబుతున్నా కూడా కొన్ని దేశాలు మాత్రం ప్రత్యర్ధులుగా
మారడం మోడీ పదేళ్ల పాలనలో ఈ విధంగా జరగడం పట్ల చర్చ అయితే సాగుతోంది.