ఆర్జీవీకి బిగ్ రిలీఫ్... హైకోర్టులో కీలక పరిణామం!

ఇటీవల... ఆర్జీవీని అరెస్ట్ చేస్తున్నారని.. ఆయన కోసం గాలిస్తున్నారని మీడియాలో చాలా కథనాలు వైరల్ గా మారాయి.

Update: 2024-12-10 09:51 GMT

సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ - ఏపీ పోలీసులు అనే వ్యవహరం గత కొన్ని రోజుల క్రితం వరకూ తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల... ఆర్జీవీని అరెస్ట్ చేస్తున్నారని.. ఆయన కోసం గాలిస్తున్నారని మీడియాలో చాలా కథనాలు వైరల్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్జీవీకి భారీ ఊరట లభించింది.

అవును... ఆంధప్రదేశ్ లో తనపై నమోదైన కేసులకు సంబంధించి ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు హైకోర్టు మద్యంతర ఉత్తర్వ్యులు ఇచ్చిన హైకోర్టు... సోమవారం (ఈ నెల 9) వరకూ అరెస్ట్ చేయొద్దని పోలీసులను ఆదేశించింది!

దీంతో... అసలు ఆ కేసు విషయంలో ఏమి జరిగింది.. మధ్యలో మీడియా ఎలా నడిపింది..అంటూ ప్రెస్ మీట్ పెట్టారు ఆర్జీవీ. ఈ క్రమంలో తాజాగా మరోసారి భారీ ఊరట లభించింది. ఇందులో భాగంగా.. తాజాగా ఆర్జీవీ పిటిషన్ పై విచారించిన హైకోర్టు మొత్తం మూడు కేసుల్లోనూ ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

కాగా... 'వ్యూహం' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై ఆర్జీవీ అసభ్యకర పోస్టులు పెట్టారని, అందువల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పలువురు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు చేశారు. దీంతో... సుమారు ఎనిమిది ప్రాంతాల్లో ఇలాంటి కేసులు నమోదైనట్లు చెబుతున్నారు.

దీంతో... పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణకు రావాలని ఆర్జీవీకి నోటీసులు ఇచ్చారు. దీంతో.. తనపై నమోదైన కేసులో అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వలని కోరుతూ రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో... తాజాగా ఆర్జీవికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వ్యులు జారీ చేసింది.

Tags:    

Similar News