తమిళ్ సైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చాడా !?
హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతుండగా వేదిక మీద ఉన్న అందరికీ నమస్కరిస్తూ తమిళిసై ముందుకు వెళ్తున్నారు. వెంటనే తమిళిసైని వెనక్కు పిలిచిన అమిత్ షా నిమిషం పాటు మాట్లాడారు.
ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 24 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేస్తున్న వేళ అదే వేదిక మీద ఒక అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. గన్నవరం సమీపంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. దీనికి తెలంగాణ మాజీ గవర్నర్, ఇటీవల లోక్ సభ ఎన్నికలలో తమిళనాడులో చెన్నై సౌత్ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయిన తమిళ్ సై కూడా హాజరయ్యారు.
హోంమంత్రి అమిత్ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడుతుండగా వేదిక మీద ఉన్న అందరికీ నమస్కరిస్తూ తమిళిసై ముందుకు వెళ్తున్నారు. వెంటనే తమిళిసైని వెనక్కు పిలిచిన అమిత్ షా నిమిషం పాటు మాట్లాడారు. ఈ సంధర్భంగా తమిళిసై పలుమార్లు ఏదో వివరించే ప్రయత్నం చేసినా అమిత్ షా వేలుతో హెచ్చరించడం కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట వైరల్ అవుతున్నది.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు తమిళనాడు బీజేపీలో చిచ్చుపెట్టాయి. బీజేపీలోకి సంఘ వ్యతిరేక శక్తులను తీసుకొచ్చారని తమిళిసై అన్నామలైని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. తమిళనాట ఓటమికి అన్నామలైని బాధ్యుడిని చేసేందుకు తమిళిసై వర్గం ప్రయత్నించినట్లు తెలుస్తుంది. తమిళిసై పార్టీ వ్యవహారాలను బహిరంగంగా చర్చిస్తున్నారని అవతలి వర్గం విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీతో అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ సీరియస్‌గా ఉంది. అన్నామలైతో గొడవ పడొద్దని తనకు తారసపడ్డ తమిళిసైని అమిత్ షా హెచ్చరించారని ప్రచారం జరుగుతున్నది.