వైసీపీ మంత్రికి జగన్ వరం ఇచ్చారా...!?

ఆయన సొంత గ్రామం మింది గాజువాక పరిధిలో ఉంది కాబట్టి అక్కడ నుంచి చేయవచ్చు అని మరో వైపు ఉంది.

Update: 2023-12-28 01:30 GMT

విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి గుడివాడ అమరనాధ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు అన్న చర్చ సాగుతోంది. ఆయన అనకాపల్లి నుంచి 2019 ఎన్నికల్లో గెలిచారు. ఈసారి ఆయన అక్కడ నుంచే పోటీకి దిగితారా లేక సీటు మారుతుందా అన్నది చాలా కాలంగా చర్చగా ఉంది. మంత్రి ఎలమంచిలి నుంచి పోటీ చేస్తారు అని ఒకవైపు ప్రచారం సాగింది. ఆయన సొంత గ్రామం మింది గాజువాక పరిధిలో ఉంది కాబట్టి అక్కడ నుంచి చేయవచ్చు అని మరో వైపు ఉంది.

ఇపుడు కొత్తగా ఇంకో నియోజకవర్గం పేరు వినిపిస్తోంది.అదే చోడవరం. ఈ సీటు మీద మంత్రి కన్ను పడింది అని అంటున్నారు. చోడవరం లో సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఉన్నారు. ఆయన సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన మంత్రి పదవిని కూడా ఆశించారు. అయితే ప్రభుత్వ విప్ పదవితో వైసీపీ పెద్దలు సంతృప్తి పరచారు.

ఇదిలా ఉంటే కరణం ధర్మశ్రీ పనితీరు పట్ల కొంత వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఈ మేరకు సర్వే నివేదికలు రావడంతో ఆయన కాకుండా కొత్త ముఖాన్ని దింపుతారు అని అంటున్నారు. అయితే ఇపుడు వైసీపీ అధినాయకత్వం మదిలో మరో ఆలోచన కూడా ఉంది అని అంటున్నారు.

కరణం ధర్మశ్రీని ఎంపీగా అనకాపల్లి నుంచి పంపించి మంత్రికి చోడవరం సీటు ఇస్తారని అంటున్నారు. అలా అయితే బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన ఇద్దరు నేతలకు అవకాశాలు సమానంగా ఇచ్చినట్లుగా ఉంటుందని అంటున్నారు అయితే కరణం ధర్మశ్రీ మాత్రం అసెంబ్లీకే పోటీ చేయడానికి పట్టుబడుతున్నారని అంటున్నారు.

ఆయన వచ్చే ఎన్నికల విషయంలో ప్రచారాన్ని కూడా మొదలెట్టేశారు. అంటే చోడవరం నుంచి ఫిక్స్ అయినట్లే అంటున్నారు. ఈ నేపధ్యంలో హై కమాండ్ నుంచి ఆయనకు పిలుపు వచ్చింది. అక్కడ ఇదే విషయం మీద చర్చ ఉంటుందని అంటున్నారు. ఒకవేళ కరణం ధర్మశ్రీ గట్టిగా పట్టుబడితే ఆయనకు ఎలమంచిలి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని కూడా అంటున్నారు.

అయితే ఆయన మాత్రం చోడవరం నుంచే పోటీ అంటే మాత్రం ఈ వ్యవహారం క్లిష్టంగానే మారుతుంది అని అంటున్నారు. ఎందుకంటే అటు మంత్రి గుడివాడ ఇటు కరణం ధర్మశ్రీ ఇద్దరూ హై కమాండ్ కి కావాల్సిన వారు. పైగా ఈ ఇద్దరూ బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన వారు. దాంతో ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనడం కంటే ఆ ప్రశ్న కూడా కష్టంగానే ఉంటుంది.

ఏది ఏమైనా కరణం ధర్మశ్రీని గుడివాడను అడ్జస్ట్ చేసి ఈ ఇద్దరు నాయకుల ద్వారా విశాఖ రూరల్ జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలన్నది వైసీపీ హై కమాండ్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు.

Tags:    

Similar News