నోటా @ 63 లక్షలు

సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని తీసుకుంది

Update: 2024-06-06 07:09 GMT

ఎన్నికల బరిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే నోటా (నన్ ఆఫ్ ది ఎబోవ్) కు ఓటు వేసేలా 11 ఏళ్ల క్రితం కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎంలో చివరి బటన్ గా నోటాను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఈసారి ఎన్నికల్లో దేశవ్యాపితంగా నోటాకు ఓట్ల సంఖ్య తగ్గింది.

దేశవ్యాప్తంగా నోటాకు 63,72,220 ఓట్లు నమోదయ్యాయి. అత్యధికంగా బీహార్ లో 8.97 లక్షల ఓట్లు నోటాకు రావడం విశేషం. ఉత్తరప్రదేశ్ లో 6.34 లక్షలు, మధ్యప్రదేశ్ లో 5.32 లక్షలె, పశ్చిమబెంగాల్ లో 5.22 లక్షలు, తమిళనాడులో 4.61 లక్షలు, గుజరాత్ లో 4.49 లక్షలు, మహారాష్ట్రలో 4.12 లక్షలు, ఏపీలో 3.98 లక్షలు, ఒడిశాలో 3.24 లక్షల ఓట్లు నోటాకు పడ్డాయి.

2019 ఎన్నికల్లో 65.22 లక్షల ఓట్లు నోటాకు రాగా, ఈ సారి 63.72 లక్షలు మాత్రమే వచ్చాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నోటాకు రెండు లక్షల 18వేల 676 ఓట్లు పడటం గమనార్హం. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి అక్షయ్‌ కాంతిరామ్‌ తన నామినేషన్‌ను ఉపసంహరించుకుని నాటకీయ పరిణామాల మధ్య బీజేపీలో చేరాడు. దీంతో ప్రజలు నోటాకు ఓట్లేయాలని కాంగ్రెస్ విజ్ఞప్తి చేసింది. అందుకే అక్కడ దానికి అన్ని ఓట్లు పోలయ్యాయి.

Tags:    

Similar News