930 మంది రూ.100 కోట్లు... డిజిటల్ అరెస్ట్ మాస్టర్ మైండ్ అరెస్ట్!

అవును... దేశవ్యాప్తంగా డిజిటల్ దోపిడీ రాకెట్ లో ప్రధాన సూత్రధారిని తాజాగా కోల్ కతాకు చెందిన సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు.

Update: 2025-01-12 04:55 GMT

ఇటీవల కాలంలో అత్యంత బలంగా వినిపించిన మాటల్లో ఒకటి "డిజిటల్ అరెస్ట్" అనే సంగతి తెలిసిందే. ఒక్కసారి వీరి చేతికి చిక్కితే బ్యాంక్ ఖాతాలన్నీ పిప్పి చేస్తారని అంటారు. ఈ సమయంలో సుమారు 930 మందిని అడిజిటల్ అరెస్ట్ చేసి, దాదాపు రూ.100 కోట్లకు పైగా దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాస్టర్ మైడ్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.

అవును... దేశవ్యాప్తంగా డిజిటల్ దోపిడీ రాకెట్ లో ప్రధాన సూత్రధారిని తాజాగా కోల్ కతాకు చెందిన సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు బెంగళూరులో అరెస్ట్ చేశారు. అతడు ఈ డిజిటల్ అరెస్టుల పేరుమీద వ్యక్తులను బెదిరించి సుమారు రూ.100 కోట్లకు పైగా దోపిడీ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో.. ఈ విషయం వైరల్ గా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరానికి చెందిన ఓ మహిళ గత సంవత్సరం సైబర్ క్రైం సెల్ లో ఫిర్యాదు చేసింది. పోలీసు అధికారిగా నటించిన వ్యక్తి నుంచి తనకు ఫోన్ వచ్చింది.. డ్రగ్స్ నింపిన పార్శిల్ తో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని.. ఆ సమయంలో ఫోన్ చేసిన వ్యక్తి డిజిటల్ అరెస్ట్ చేస్తామని బెదిరించారని ఆమె తెలిపింది.

దీంతో.. తీవ్ర భయాందోళనకు గురైన ఆ మహిళ సహాయం కోసం వేడుకోగా.. మోసగాళ్లు ఆమెపై ఉన్న నేరాలను ఎత్తి వేయడానికి అన్నట్లుగా రూ.47 లక్షలు డిమాండ్ చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ క్రమంలో.. ఆ బెదిరింపులు నమ్మిన మహిళ పలు దఫాలుగా డబ్బును బదిలీ చేసినట్లు తెలిపింది.

అయితే... డబ్బు మొత్తం కోల్పోయిన తర్వాత కానీ... ఆమె మోసపోయినట్లు గ్రహించలేదని తెలిపింది. ఈ మేరకు ఆమె గత ఏడాది జూన్ 17న ఈ ఫిర్యాదు చేసింది. దీంతో... రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ సమయంలో బరేంద్రపూర్, పటులి, ఆనంద్ పూర్ తో సహా పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు.

ఈ క్రమంలోనే చిరాగ్ కపూర్ పేరు ఈ డిజిటల్ అరెస్టుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ గా బయటపడిందని చెబుతున్నారు. చట్టబద్దమైన ఉద్యోగాల ముసుగులో యువకులను కాల్ సెంటర్ కోసం నియమించుకుని.. ఢిల్లీలోని ఓ కార్పొరేట్ బిల్డింగ్ లోని ఆఫీసు నుంచి కపూర్ ఈ ఆపరేషన్ నడిపినట్లు చెబుతున్నారు. ఇతడి బాధితులు దేశవ్యాప్తంగా ఉన్నారని అంటున్నారు.

ఈ సమయంలో ఆ ఆఫీసుల నుంచి 140 సిమ్ కార్డులు, 104 పాస్ పుస్తకాలు, 61 మొబైల్ ఫోన్లు, 40 సీల్ లు, 33 డెబిట్ కార్డులు, 2 క్యూఆర్ కోడ్ మెషిన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News