ఒకరు నౌకా దళపతి.. మరొకరు సైన్యాధిపతి.. ఇద్దరిదీ ఒకటే తరగతి

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లను త్రివిధ దళాలుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. వీటిలో ఆర్మీ అంటే సైన్యం

Update: 2024-06-30 14:30 GMT

చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితుడే ఉద్యోగంలో కొలీగ్ అయితే.. ఒకే బెంచీపై కూర్చున్న ఇద్దరు దోస్తులే తర్వాత ఉన్నతోద్యోగులైతే.. భుజంపై చేయి వేసుకుని తిరిగిన ఫ్రెండ్సే దేశానికి భుజం కాసే వారయితే.. చెప్పుకొనేందుకు ఈ అనుభూతి ఎంతో బాగుంటుంది కదా..? ఇప్పుడలాంటి సందర్భమే వచ్చింది.

అతిపెద్ద ఆర్మీకి సారథి ఆయన

ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లను త్రివిధ దళాలుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. వీటిలో ఆర్మీ అంటే సైన్యం.. తాజాగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సైన్యాధిపతిగా నియమితులయ్యారు. ఈయన కంటే ముందే అడ్మిరల్ దినేష్ త్రిపాఠి భారత నౌకా దళ సారథి. దేశ రక్షణ దళాల అత్యున్నత కమాండర్లు అయిన వీరిద్దరూ బాల్య స్నేహితులు కావడం విశేషం. కలిసి చదువుకున్నారు కూడా. మధ్యప్రదేశ్ లోని రేవా లో ఉండే సైనిక స్కూల్ పూర్వ విద్యార్థులు వీరు. 1970లో వీరు కలిసి చదువుకున్నారు. సహజంగానే అప్పటినుంచే వీరు థిక్ ఫ్రెండ్స్.

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్మీ అయిన భారత సైన్యానికి లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సారథి. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ తీరం ఉన్న భారత నౌకాదళానికి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి కెప్టెన్. ఇలా వేర్వేరు దళాలకు నాయకత్వం వహిస్తున్నా.. వీరిద్దరూ సలహాలు సంప్రదింపులు జరుపుకొంటూనే ఉంటారట. కాగా, ఇలాంటి మెరికల్లాంటి విద్యార్థులను మిలటరీకి అందించిన రేవా సైనిక్ స్కూల్‌ ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

పుట్టిన రోజు ముందు..

లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది 1964 జూలై 1న జన్మించారు. అంటే సరిగ్గా 60 ఏళ్ల కిందట అన్నమాట. తన పుట్టిన రోజుకు ముందు ఆయన సైన్యాధిపతి బాధ్యతలు చేపట్టారు. ద్వివేది 1984 డిసెంబరు 15న సైన్యంలో చేరారు. వివిధ కీలక పోస్టుల్లో పనిచేశారు. నార్తర్న్‌ ఆర్మీ కమాండర్‌ గా సుదీర్ఘ కాలం సేవలందించారు.

Tags:    

Similar News