ఈ విషయంలో వైసీపీ టీడీపీ డిటో...!?

పూర్వకాలంలో చాలా మంది నేతలు ఎంపీగా అయితేనే పోటీకి రెడీ అని షరతు కూడా పెట్టేవారు.

Update: 2023-12-27 00:30 GMT

ఒకనాడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఎంతో గౌరవం దర్జా కూడా. భారత పార్లమెంట్ అత్యున్నత చట్ట సభ. ఆ సభలో మెంబర్ గా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం డిబేట్ చేయడం అంటే ఎంతో గౌరవప్రదం అని రాజకీయ నేతలు భావించేవారు. పూర్వకాలంలో చాలా మంది నేతలు ఎంపీగా అయితేనే పోటీకి రెడీ అని షరతు కూడా పెట్టేవారు. తన డిగ్నిటీకి స్థాయికి ఎంపీ పదవి తగినది అని నాయకులు భావించేవారు.

అయితే గత కొన్నాళ్ళుగా చూస్తే ఎంపీ సీటు అంటే మోజు తగ్గుతోంది. అదే టైం లో సర్దుబాటు చేసేందుకు రాజకీయ పునారాసం కింద ఈ సీట్లకు అభ్యర్ధులను నిర్ణయిస్తున్నారు. అలాగే గతంలో మాదిరిగా ఎంపీలకు పూర్తి స్వేచ్చ కూడా ఉండకపోవడంతో వారు ఎంపీ సీటు అంటే మొగ్గు చూపించడంలేదు. ఇక ఎంపీ అయ్యాక ఎమ్మెల్యేలకు వారికి మధ్యన గ్యాప్ ఏర్పడుతోంది.

అటు ఢిల్లీలో పరపతి లేకపోగా ఇటు ఉన్న చోట ఎవరూ మాట వినక సతమతమవుతున్న వారే ఎక్కువ. అదే సమయంలో ఎంపీ సీటు అంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలవాలి. దాంతో రాజకీయ పార్టీలు కూడా ఎంపీల మీద భారాలు పెడుతున్నాయి. ఎంపీల పరిధిలోని ఎమ్మెల్యేలను గెలిపించుకేందుకు అర్ధబలం అంగబలం సమకూర్చాల్సి వస్తోంది.

ఇవన్నీ తడిసి మోపెడు అవుతున్నాయి. దాంతో చాలా పార్టీలలో ఎమ్మెల్యే సీటు అంటే బెటర్ అనుకునే పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అయితే తక్కువ ఖర్చుతో బయటపడవచ్చు. లోకల్ గా పట్టు ఉంటుంది. తన అధికారాలు సజావుగా వాడుకోవచ్చు అని ఆలోచిస్తున్నారు. లక్ తగిలితే మంత్రి కూడా కావచ్చు అన్నది మరో ఆలోచన.

అదే ఎంపీ అయితే ఢిల్లీకి వెళ్ళి రావడం తప్ప పెద్దగా ప్రయోజనం లేదని కూడా అంటున్నారు పైగా లోకల్ గా రిలేషన్స్ మొత్తం పోతున్నాయని మరో ఎన్నిక వచ్చేనాటికి తాము ఎవరో క్యాడర్ కి తెలియక అపరిచితులం అవుతున్నామని అంటున్నారు. ఈ పరిణామాలతో ప్రధాన పార్టీలలో చాలా మంది నేతల చూపు ఎమ్మెల్యే సీటు మీదనే ఉంది తప్ప ఎంపీ మీద కాదు అని అంటున్నారు

దాంతో తెలుగుదేశం పార్టీ కానీ వైసీపీ కానీ ఎంపీ అభ్యర్ధుల వేటలో చాలా శ్రమించాల్సి వస్తోందని అంటున్నారు. అంగబలం అర్ధ బలం కావాలి దాంతో పాటు సామాజిక సమీకరణలు కూడా సరిపోవాల్సి ఉంది. ఇలా అన్ని లెక్కలు చూసుకుని ఎంపీ క్యాండిడేట్ల కోసం సెర్చ్ చేస్తూంటే అనుకున్న వారు ఎవరూ కనిపించడంలేదు అని అంటున్నారు.

వైసీపీ సీనియర్ నేతలను మంత్రులను మాజీ మంత్రులను ఎంపీలుగా ఈసారి చాన్స్ ఇవ్వాలని చూస్తే చాలా మంది అంతగా ఆసక్తిని చూపించడంలేదని అంటున్నారు. అదే టీడీపీలో కూడా యువతకు ఎమ్మెల్యే చాన్స్ ఇచ్చి పెద్ద నాయకులను ఢిల్లీ బాట పట్టించాలని చూసినా మాకు ఎమ్మెల్యే ముద్దు అంటున్నారని టాక్. దాంతో పాతిక ఎంపీ సీట్లు ఉన్న ఏపీలో అధికార విపక్షాలు రెండూ కూడా ఎంపీ అభ్యర్ధుల విషయంలోనే కసరత్తు గట్టిగా చేయాల్సి వస్తోందిట.

చిత్రమేంటి అంటే ఈ రోజుకు కూడా సగానికి సగం మంది కూడా ఎంపీ అభ్యర్ధులు ఫైనలైజ్ కాలేదని అంటున్నారు. వైసీపీకి 2019 ఎన్నికల్లో 22 మంది ఎంపీలు గెలిచారు. అందులో రెబెల్ ఎంపీ రాజుని పక్కన పెడితే మిగిలిన 21 మందిలో కొందర్ని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తోంది. అలాగే మరి కొందరికి దూరం పెట్టాలని అనుకుంటోందని తెలుసోంది.

అయితే మరోసారి టికెట్లు దక్కేది పాత వారిలో అరడజన్ మందికి మాత్రమే అని అంటున్నారు. మిగిలిన వారిని కొత్త ముఖాలుగా వెతికి తీసుకుని రావాల్సి ఉంది ఎమ్మెల్యేలను ఢిల్లీ బాట పట్టించాలనుకుంటే నో చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఎమ్మెల్సీలలో గట్టి వారిని అలాగే రాజ్యసభలో ఉన్న వారిని కూడా ఎంపీలుగా పోటీకి పెట్టాలనుకుంటోంది. కానీ ఎలా వీలు పడుతుందో తెలియడంలేదు అంటున్నారు ఈ విషయంలో వైసీపీ టీడీపీలలో డిటో గానే సీన్ ఉందని అంటున్నారు.

Tags:    

Similar News