‘నేను శ్రీరాముడిని కాదు’... దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారంలో మాధురి భర్త ఎంట్రీ!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2024-08-13 09:57 GMT

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగైదు రోజులుగా ఈ విషయమే మీడియాలో హాట్ టాపిక్ లా మారిన పరిస్థితి. ఈ వ్యవహారంలో తనను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని, ట్రోలింగ్ చేస్తున్నారనే మనస్థాపంలో ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాధురి భర్త ఎంట్రీ ఇచ్చారు.

అవును... దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారంలో ఎన్నో ట్విస్టులు నెలకొంటున్న సంగతి తెలిసిందే. రోజుకో కీలక మలుపు అన్నట్లుగా ఈ వ్యవహారం ఉంది. ఈ సమయంలో ఆత్మహత్య ప్రయత్నం చేసిన మాధురి ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సమయంలో... ఈ వివాదంపై అమెరికాలో ఉంటున్న మాధురి భర్త దివ్వెల మహేష్ చంద్రబోస్ స్పందించారు. ఈ సందర్భంగా తన భార్యకు మద్దతుగా నిలిచారు.

ఇందులో భాగంగా... తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, కాకపోతే మాధురి ఇష్టపడటంతోనే వైసీపీలోకి వెళ్లడానికి మద్దతు తెలిపినట్లు మహేష్ తెలిపారు. తాను టీడీపీ అభిమానిని అయినప్పటికీ.. ఆమె జగన్ అభిమాని కావడంతో వైసీపీలో చేరినట్లు తెలిపారు. తన భార్య ఏమిటో తనకు తెలుసని, ఆమె రాజకీయంగా ఎదుగుతోందనే కారణంతోనే ఆమెపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.

ఇదే సమయంలో తన భార్య మాధురి గురించి ఎవరు ఏమి చెప్పినా, ఎన్ని చెప్పినా అనుమానించడానికి తాను శ్రీరాముడిని కాదంటూ తాజాగా ఆయన ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో... ఆమె బాగా డ్యాన్స్ చేస్తుందని, తన డ్యాన్సులు కూడా ట్రోల్ చేస్తున్నారని ఆయన విచారం వ్యక్తం చేశారు. తనకు వచ్చే జీతం మొత్తం మాధురికే పంపిస్తానని తెలిపారు.

ఇక, తనకు మాధురి తల్లిలాంటిదని, తనను ఎంతో బాగా చూసుకుంటుందని, అలాంటి ఆమె గురించి ఎవరు ఎన్ని చెప్పినా పట్టించుకోనని.. ఆమె అప్పుడు కొన్ని సమస్యలు చెప్పుకుని బాధపడితే తాను ఓదారుస్తానని అన్నారు. ఇక మాధురి రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక వాణి ఆమెపై అభాండాలు వేస్తున్నారని అన్నారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ - మాధురి ఒకే ఇంట్లో ఉండటంపైనా స్పందించిన ఆయన "నో కామెంట్" అని స్పష్టం చేశారు.

Full View
Tags:    

Similar News