పాకిస్తాన్ నటులు ఏజెంట్లులా కనిపిస్తున్నారా?
తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటుడు రాజీవ్ ఖందేల్వాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
శత్రుదేశం పాకిస్తాన్ కళాకారులపై ఏదో వివాదాస్పద అంశం విషయంలో హైలైట్ అవ్వడం...తద్వారా వాళ్లపై అప్పుడప్పుడు బాలీవుడ్ నిష్క్రమణకు గురవుతోన్న సంగతి తెలిసిందే. అందుకు కారణాలు అనేకం. పాక్ నటులు భారత్ తీరును తప్పుబట్టడం కావొచ్చు...తమ హక్కుల్ని కాపాడుకునే క్రమంలో చేసే వ్యాఖ్యలు కావొచ్చు. కారణం ఏదైనా గతంతో పొలిస్తే ఈ మద్య కాలంలో పాకిస్తాన్ నటులు బ్యాన్ కి గురవుతున్నారు.
తాజాగా ఈ అంశంపై బాలీవుడ్ నటుడు రాజీవ్ ఖందేల్వాన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. రాజకీయాల వల్లే పాకిస్తాన్ నటులపై నిషేధం అంశం తెరపైకి వస్తుందన్నారు. `ఇది చాలా పెద్ద తప్పు. ఆర్టిస్టులపై బ్యాన్ విధించడానికి రాజకీయ నాయకులకు హక్కు ఏముంటుంది? మనల్ని నిర్దేశించడానికి వీళ్లెవరు? ఈ నాయకులంతా ఒకటే అనుసరిస్తారు. రెండు దేశాల మధ్య ప్రేమ చిగురించడానికి అస్సలు పట్టించుకోరు.
ఇలా ఎందుకు చేస్తున్నారో అర్దం కావడం లేదు. మనం ఎప్పుడూ శాంతి, సామరస్యం అని మాట్లాడుతాం. అవి ఉన్నచోట కూడా రాజకీయ పార్టీలు, హిందు, ముస్లీం అన్న కోణాలు తె రపైకి వస్తుంటాయి. ఇది అత్యంత దారుణమైన చర్య. పాకిస్తాన్ ప్రభుత్వం ఆర్టిస్టులను భారత్ కి ఏజెంట్లుగా పంపిచలేదు. అయినా భారతీయ సినిమాల్లో నటించడానికి ఒప్పుకోకపోవడం ఎంతో బాధకు గురి చేస్తుంది.
ఇది ఏమాత్రం భావ్యమైన చర్యగా నేను భావించడం లేదు. భారత్ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. కుల మతాలకు అతీతమైన దేశం. ప్రపంచదేశాలన్నీ భారత్ గురించి ఎంతో గొప్పగా చెబుతాయి. ఇక్కడ ప్రజలు ఎంతో మంచి వారు. ఎంతో ఆదరిస్తారు. కళాకారులకు ఎంతో గౌరవం, గుర్తింపు ఉంది. భాషతో సంబంధం లేకుండా అందర్నీ ఇక్కడ ప్రజలు ఆదరిస్తారు. అది నాకోంతో నచ్చుతుంది` అని అన్నారు