భారత్ ఎన్నికల్లో అమెరికా నిధులు.. మస్క్ షాకింగ్ నిర్ణయాలు!

ఈ సమయంలో భారతదేశం సహా పలు దేశాలకు అందించే మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేసింది. అయితే.. ఆ నిధులు భారత్ లో ఎన్నికలకు సంబంధం ఉండటం తీవ్ర చరనీయాంశంగా మారింది.

Update: 2025-02-16 09:58 GMT

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో అగ్రరాజ్యం అమెరికా నిధుల పాత్ర ఇప్పుడు సంచలనంగా మారింది. డోజ్ సారథి ఎలాన్ మస్క్ చేసిన ఓ ప్రకటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత్ లో జరిగే ఎన్నికల్లో ఓటరు సంఖ్యను పెంచేందుకు అందించే సాయాన్ని రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అవును... అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృతంలోని అమెరికాలో కొత ప్రభుత్వం బడ్జెట్ కోతలకు తెరలేపిన సంగతి తెలిసిందే. దీనికోసం ప్రత్యేకంగా మస్క్ నేతృత్వంలో డోజ్ ను ఏర్పాటుచేశారు. ఈ సమయంలో భారతదేశం సహా పలు దేశాలకు అందించే మిలియన్ డాలర్ల నిధులను రద్దు చేసింది. అయితే.. ఆ నిధులు భారత్ లో ఎన్నికలకు సంబంధం ఉండటం తీవ్ర చరనీయాంశంగా మారింది.

ఇందులో భాగంగా... భారత్ లో జరిగే ఎన్నికల్లో ఓటర్ల సంఖ్యను పెంచేందుకు అందించే 21 మిలియన్ డాలర్లను రద్దు చేసినట్లు డోజ్ పేర్కొంది. డిపార్ట్ మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించింది. దీంతో.. భారత్ లో రాజకీయ దుమారం రేగే అవకాశం ఉందా అనే చర్చ తెరపైకి వచ్చిందని అంటున్నారు.

ఇటీవల డొనాల్డ్ ట్రంప్ - నరేంద్ర మోడీ భేటీ అయిన సంగతి తెలిసిందే. వారు కలిసిన కొద్ది రోజులకే "భారతదేశానికి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యానికి కేటాయించిన 21 మిలియన్ డాలర్ల ప్రత్యేక సాయాన్ని రద్దు చేస్తున్నాం" అని డోజ్ ప్రకటించడం మరింత కీలకంగా మారిందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ స్పందించింది. ఇందులో భాగంగా.. బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ... ఓటర్ల సంఖ్య పెంచేందుకు 21 మిలియన్ డాలర్లా..? ఇది భారత్ లోని ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్ష భాగం కాదు.. దీని నుంచి ఎవరు లాభపడుతున్నారు? కచ్చితంగా అధికార పార్టీ మాత్రం కాదు అని ఎక్స్ లో రాసుకురావడం గమనార్హం.

మరోపక్క.. బంగ్లాదేశ్ లో రాజకీయ స్థిరత్వాన్ని మెరుగుపరిచేందుకు అందిస్తున్నట్లు చెబుతున్న 29 మిలియన్ డాలర్ల నిధులను కూడా కోత విధించింది డోజ్. ఇదే సమయంలో... కంబోడియా, సెర్బియా, మోల్టోవా, నేపాల్, లైబీరియా, బాలి, దక్షిణాఫ్రికా మొదలైన దేశాలకు అందించే నిధులకు కోత విధించింది.

ఏది ఏమైనా... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో జరిగిన ఎన్నికల్లో విదేశీ జోక్యం బయట పడటం ఇప్పుడు వైరల్ గా మారిందని అంటున్నారు. పైగా దీంతో అధికార పార్టీకి ఏమీ సంబంధం లేదని బీజేపీ నేత చెప్పడంతో.. ఈ వ్యవహారంపై మోడీ సర్కార్ విచారణ జరిపించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి.

Tags:    

Similar News