ఆసక్తికరంగా ట్రంప్ రాజకీయం... రాహుల్ నేర్చుకోవాల్సిందేనా?

ఈ సమయంలో ట్రంప్ మార్క్ పాలిటిక్స్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.

Update: 2024-11-09 10:15 GMT

అత్యంత ఆసక్తికరంగా జరిగిన అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సూపర్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. మ్యాజిక్ ఫిగర్ 270 కి గానూ సుమారు 50.5 శాతం ఓట్లతో ఆయన 301 ఓట్లు సాధించారు! ఈ సమయంలో ట్రంప్ మార్క్ పాలిటిక్స్ కి సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది.

అవును... ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించిన ట్రంప్.. త్వరలో అమెరికా తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో... అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మార్కు రాజకీయం ఎలా జరిగింది.. డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ చేసిన విమర్శలకు ఆయన ఏ రకంగా కౌంటర్స్ ఇచ్చారు అనేది వెలుగులోకి వచ్చింది.

"సక్సెస్ అంటే ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టిన ఫుడ్డా.. అరగంటలో రావడానికి.. సక్సెస్... టైం పడుతుంది" అన్నట్లుగా... సక్సెస్ ఎవరికీ ఊరికే రాదు.. దాని వెనుక బయట ప్రపంచానికి కనిపించని ఎంతో శ్రమ ఉంటుంది.. మరెంతో ఓర్పుతో కూడిన నేర్పు ఉంటుంది.. యూనిక్ ఆలోచనా విధానం ఉంటుంది. ఇవన్నీ కలిస్తేనే ఎవరికైనా విజయం వరిస్తుందని అంటారు.

ఈ సమయంలో తాజాగా జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సర్వేల ఫలితాలను, విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ ట్రంప్ విజయం సాధించారు. అందుకు ఒక కారణంగా కనిపిస్తూ ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోలో హారిస్ ప్రసంగాలను ట్రంప్ లైవ్ మానిటరింగ్ చేస్తూ స్పందిస్తున్నారు.

ప్రత్యర్థి కమలా హారిస్ ఆరోపణలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తున్నారు.. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో... తన బృందంతో కలిసి కమలా హారిస్ ప్రసంగాలను ఫాలో అవుతున్న డోనాల్డ్ ట్రంప్.. వాటికి వెంటనే రిప్లై ఇస్తున్నారు. ఆ సమాధానాలను టైప్ చేసిన స్టాఫ్.. వాటినే వెంటనే ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి పోస్ట్ చేసేవారంట!

దీంతో... కమలా హారిస్ చేసిన వ్యాఖ్యలు, విమర్శలు, ఇచ్చిన హామీలు, చెప్పిన స్టేట్ మెంట్స్ జనాల్లోకి వెళ్లేలోపు.. వాటితో పాటు ట్రంప్ కౌంటర్లు కూడా వెను వెంటనే వాటితో పాటు చేరిపోయేవి. దీంతో.. కమలా హారిస్ ప్రసంగాలతో పాటు ట్రంప్ వాయిస్ కూడా స్పాట్ లో సోషల్ మీడియాలో దర్శనమిచ్చేదని.. ఇది ట్రంప్ కు చాలా ప్లస్ అయ్యిందని అంటున్నారు.

ఈ సందర్భంగా గత రెండు మూడు దఫాలుగా మోడీని దింపాలని, బీజేపీని కొట్టాలని ప్రయత్నిస్తున్న రాహుల్ లాంటి యువనేతలకు ఈ ట్రంప్ మార్కు పాలిటిక్స్ కచ్చితంగా ఉపయోగపడతాయని.. నిత్యం సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉండాలి.. ప్రత్యర్థుల విమర్శలకు మరెంత వేగంగా కౌంటర్స్ ఇవ్వాలి అనేది ఈ ఒక్క వీడియోతో స్పష్టమవుతుందని అంటున్నారు పరిశీలకులు.

మరోపక్క... నేటి రాజకీయాల్లో కచ్చితత్వం కంటే ముందు ఇన్ టైం కౌంటర్ చాలా ముఖ్యమని.. దానివల్ల నాయకుడు నిత్యం లైవ్ లో ఉంటున్నాడని, అనునిత్యం అందుబాటులో ఉన్నట్లు స్పందిస్తున్నాడనే భావన ప్రజల్లోకి వెళ్తుందని.. దొంగ పడిన ఆరు నెలలలకు ఏదో జరిగిందన్నట్లుగా కాకుండా., ప్రత్యర్థి వ్యాఖ్యలు జనాల్లోకి వెళ్లే క్రమంలోనే తమ రియాక్షన్ కూడా వెళ్లాలని చెబుతున్నారు.

ఏదీ ఏమైనా... ట్రంప్ మార్క్ పాలిటిక్స్ కి సంబంధించిన ఈ పొలిటికల్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇది యువ రాజకీయ నాయకులకు మంచి లెసన్ అని అంటున్నారు!

Tags:    

Similar News