ట్రంప్‌ పై కాల్పులు జరిపింది ఇతడే!

ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పై కాల్పుల ఘటన కలకలం రేపింది.

Update: 2024-07-14 08:26 GMT

ఈ ఏడాది నవంబర్‌ లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పై కాల్పుల ఘటన కలకలం రేపింది.

కాగా ట్రంప్‌ పై హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు గుర్తించారు. అతణ్ని 20 ఏళ్ల థామస్‌ మాథ్యూ క్రూక్స్‌ గా ధ్రువీకరించారు. అతడిది పెన్సిల్వేనియాలోని బెతెల్‌ పార్క్‌ ప్రాంతమని సమాచారం. ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎవరినీ ఆ ప్రాంతంలోకి రానీయడం లేదు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పై జరిగిన హత్యాయత్నంతో ఒక్కసారి ప్రపంచం ఉలిక్కిపడింది.

కాగా ట్రంప్‌ ప్రచారంలో ఉండగా ఒక ఇంటిపై నక్కి ట్రంప్‌ ను తుపాకితో కాల్చాడు. దీంతో అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌ పోలీసులు అతడిని కాల్చిచంపారు. కాల్పులకు ముందు అతడు రికార్డు చేశాడని చెబుతున్న ఓ వీడియో కూడా వైరల్‌ అవుతోంది. అందులో రిపబ్లికన్‌ పార్టీని, ట్రంప్‌ ను తాను ద్వేషిస్తున్నానని అతడు చెప్పడం గమనార్హం.

నిందితుడు థామన్‌ మాథ్యూ రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదారుడే. ఈ విషయాన్ని స్వయంగా అతడే గతంలో పేర్కొన్నాడు. ప్రభుత్వ ఓటింగ్‌ రికార్డుల ప్రకారం.. అతడు రిపబ్లికన్‌ పార్టీ మద్దతుదాడిగా నమోదు చేసుకున్నాడు. అయితే అతడు 2021లో డెమోక్రటిక్‌ పార్టీకి అనుబంధంగా ఉండే ప్రోగ్రెసీవ్‌ టర్న్‌ ఔట్‌ కు 15 డాలర్ల విరాళాన్ని ఇవ్వడం విశేషం.

కాగా నిందితుడు థామస్‌ మాథ్యూ పక్కా ప్లాన్‌ తోనే ట్రంప్‌ పై దాడికి పాల్పడ్డు తెలుస్తోంది. ట్రంప్‌ పై హత్యాయత్నానికి ముందే అతడు సమీపంలోని ఒక ఇంటిపై నక్కి ఉన్నాడు. ట్రంప్‌ ప్రచార వేదికకు 100 మీటర్ల సమీప దూరం నుంచే తన టార్గెట్‌ (ట్రంప్‌) ను చేధించేందుకు సెమీ ఆటోమేటిక్‌ రైఫిల్‌ ను సిద్ధంగా ఉంచుకున్నాడు. అతడిని వెంటనే కాల్చిచంపిన పోలీసులు అతడి వద్ద ఉన్న రైఫిల్‌ ను స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద పోలీసులకు ఎలాంటి ఐడీ కార్డులు దొరకలేదు.

కాగా నిందితడు థామస్‌ మాథ్యూకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ముందుగానే సోషల్‌ మీడియాలో, మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. ఇతడే అనుమానితుడని వెల్లడించాయి. మరోవైపు ఈ ఘటనపై పూర్తి విచారణ జరపుతామని ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌ఐబీ) ప్రకటించింది. నిందితుడికి సంబంధించి మరిన్ని విషయాలు ఎవరికైనా తెలిస్తే తమకు వెల్లడించాలని కోరింది.

Tags:    

Similar News