హిమంత.. అనవసరంగా హిందుత్వంతో పెట్టుకోకయ్యా?

సోషల్ మీడియాలో మనం పోస్టు చేసే వాటిలో తప్పులు లేకుండా చూసుకోవడం మన బాధ్యత

Update: 2023-12-29 13:34 GMT

అసోం ముఖ్యమంత్రి ఎప్పుడు వివాల్లోనే ఉంటుంటారు. ఆయన ఏది చేసినా అది సంచనలంగా మారడం సహజమే. ఈనేపథ్యంలో ఆయన ఓ తప్పు చేశారు. రోజుకో భగవద్దీత శ్లోకం ట్విట్టర్ లో పోస్టు చేస్తుంటారు. రోజువారీగా అదో అలవాటుగా మార్చుకున్నారు. దీంతో రోజుకో శ్లోకం చొప్పున ఇప్పటివరకు సుమారు 700 వరకు శ్లోకాలు పెడుతున్నారు. దీంతో గీతలోని శ్లోకాలు అన్ని భక్తులకు తెలియజేయడమే విధిగా పెట్టుకున్నారు. హైందవ ధర్మాన్ని ప్రచారం చేసే క్రమంలో ఇదో విధిగా మలుచుకున్నారు.

సోషల్ మీడియాలో మనం పోస్టు చేసే వాటిలో తప్పులు లేకుండా చూసుకోవడం మన బాధ్యత. కానీ అందులో ఏవైనా పొరపాట్లు దొర్లితే మనమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బాధ్యత గల పదవిలో ఉంటూ మనం పెట్టే పోస్టుల్లో తప్పులు ఉంటే మన విధికే కళంకం వస్తుంది. తొందరపాటులో ఇవేమీ చూసుకోకుండా అసోం ముఖ్యమంత్రి పెట్టిన పోస్టు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.

ఇంతకీ ఏమిటీ పోస్టు అంటే అసోం ముఖ్యమంత్రి టీంలోని సభ్యుడు 18వ అధ్యాయంలోని ఒక శ్లోకాన్ని తప్పుడగా అనువదించి పోస్టు చేశాడు. దీంతో ట్విట్టర్ లో అందరు చదివారు. దాని అర్థం తీవ్రంగా ఉండటంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విమర్శల బారిన పడ్డారు. సీఎం హోదాలో ఆయన ఇలాంటి పోస్టు పెట్టడంపై అంతా కంగుతిన్నారు.

గీత ప్రకారం మూడు కులాలు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులకు సేవ చేయడం శూద్రుల విధి అని తప్పుగా పోస్టు చేయడంతో రాజకీయ దుమారం రేగుతోంది. దీనిపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల పరంగా విడదీసి శూద్రులను అవమానపరచడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. దీంతో అసోం ముఖ్యమంత్రి చేసిన పనికి విమర్శలు ఎదుర్కొంటున్నారు.

బీజేపీ నాయకులు హిందూ మతం గురించి చెప్పేది ఇదేనా? వారి అసలు రూపం ఇలాగే ఉంటుందా? అనే కోణంలో ప్రశ్నలు వస్తున్నాయి. స్వేచ్ఛ, సమానత్వం వంటి వాటికి విరుద్ధమైన అర్థాలు చెబుతున్నారని విమర్శిస్తున్నారు. హిమంత బిశ్వ శర్మ నిర్వాకం ఇప్పుడు అందరిలో ఆశ్చర్యం కలిగేలా చేసింది. ఆయన అసలు లోపల ఇలాగే ఆలోచిస్తారనే వాదనలు వస్తున్నాయి.

Tags:    

Similar News