ఆనంద్ మహీంద్ర మనసు దోచిన దోశ మెషిన్... వీడియో వైరల్!
అవును... సరికొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చినప్పుడు వాటిని అభినందిస్తూ ఎక్స్ వేదీకగా నిత్యం స్పందిస్తుంటారు ఆనంద్ మహీంద్రా.
క్రియేటివిటీ, ఇన్నోవేషన్ కు సంబంధించిన ఏ విషయం కనిపించినా.. దానికి సంబంధించిన వీడియోను సైతం పోస్ట్ చేస్తూ దానిపై స్పందిస్తూ, క్రియేటర్లను అభినందిస్తూ, మరికొన్ని సార్లు పలు ఆఫర్లు ప్రకటిస్తూ నెట్టింట సందడి చేస్తుంటారు మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా. ఈ క్రమంలో తాజాగా ఓ దోశ మెషిన్ పై ఆసక్తికరంగా స్పందించారు.
అవును... సరికొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చినప్పుడు వాటిని అభినందిస్తూ ఎక్స్ వేదీకగా నిత్యం స్పందిస్తుంటారు ఆనంద్ మహీంద్రా. ఈ సందర్భంగా ఆసక్తికర కామెంట్లు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఎక్స్ లో ఆయన ఓ దోశ మెషిన్ పై స్పందిస్తూ... దానికి "డెస్క్ టాప్ దోశ" అంటూ అభివర్ణించారు. దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్ గా మారింది.
సాధారణంగా దోశ ఎలా వేస్తారనేది తెలిసిన విషయమే! అయితే అందుకు భిన్నంగా ఓ టిఫిన్ సెంటర్లో మెషిన్ సాయంతో మసాలా దోశ వేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మేషిన్ ను పాట్నాలోని ఓ టిఫిన్ సెంటర్ లో ఉపయోగించినట్లు చెబుతున్నారు. దీన్ని "22వ శతాబ్దపు దోశ మెషిన్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ వీడియోపై ఆనంద్ మహీంద్ర కూడా స్పందించారు. ఇందులో భాగంగా.. "డెస్క్ టాప్ దోశ" గా అభివర్ణించారు. దీంతో.. దీనికి సంబంధించిన వీడియో మరింత వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా... "దోశ ప్రింటింగ్ మెషిన్ భవిష్యత్తులో ఆహార పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు చేయగలదు" అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. "దోశ తయారీలో మానవ స్పర్శను విడదీయలేము" అంటూ మరొకరు స్పందించారు. "భారతీయులు చాలా ప్రతిభావంతులు.. సరైన వనరులు లభిస్తే, మనం అద్భుతాలు చేయగలం" అంటూ ఇంకొకరు రియాక్ట్ అయ్యారు.