ఆ డ్రోన్ ప్రభుత్వానిదే.. తేల్చేసిన పోలీసులు

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆసక్తికర విషయాలను తెలిపారు.

Update: 2025-01-20 11:38 GMT

జనసేన ప్రధాన కార్యాలయంపై ఎగిరిన డ్రోన్ ప్రభుత్వానిదేనని పోలీసులు దర్యాప్తులో తేలింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపిన పోలీసులు ఆసక్తికర విషయాలను తెలిపారు. జనసేనతోపాటు టీడీపీ కార్యాలయంపైనా డ్రోన్ ఎగిరినట్లు గుర్తించారు.

జనసేన కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ ఎగరేసినట్లు రెండు రోజుల క్రితం గుర్తించారు. దీనిపై పోలీసులు విచారణ జరపగా, అది ఏపీ ఫైబర్ నెట్ సంస్థ డ్రోన్ గా గుర్తించారు. మంగళగిరి నియోజకవర్గంలో ట్రాఫిక్, పారిశుధ్య పనులు, కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం సర్వే చేయిస్తోంది. ఇందుకోసం ఏపీ ఫైబర్ నెట్ కు చెందిన డ్రోన్ వాడినట్లు గుర్తించారు. జనసేనతోపాటు టీడీపీ కార్యాలయం సమీపంలోనూ ఈ డ్రోన్ ద్వారా సర్వే చేయించారు. అయితే ఈ సమాచారం ముందుగా లేకపోవడంతో జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక పోలీసుల విచారణలో అసలు విషయం తెలియడంతో జనసేన కార్యకర్తలు ఊపిరిపీల్చుకున్నారు. గత రెండు రోజులుగా పలు రకాలుగా దర్యాప్తు చేసిన పోలీసులు చివరికి మిస్టరీని ఛేదించారు.

Tags:    

Similar News